MovieGQ

Selayeti Gala Gala

Tulasi (1974) · Track 4 of 6

Song Details

Music Director
Lyricist

Lyrics

పల్లవి: లలలలాలలలా...అహా... లలలలాలలలా...అహా... అహహహా...హా..అహహహా...హా... సెలయేటి గలగల... ఆ... చిరుగాలి కిలకిలా..ఆ.. సెలయేటి గలగల చిరుగాలి కిలకిల సిగ్గుపడే బుగ్గలతో చెలి నవ్వుల మిల మిల చిలిపి చిలిపి చూపులతో నీ ఊహలే తళతళ చరణం: 1 చందమామ కన్నా నీ చెలిమి చల్లన సన్నజాజి కన్నా నీ మనసు తెల్లన నిన్ను కౌగిలించ గుండే ఝల్లన ఆ...నిన్ను కౌగిలించ గుండే ఝల్లన నిలువెల్ల పులకించె మెల్లమెల్లన సెలయేటి గలగల...ఆ... చిరుగాలి కిలకిల..ఆ... సెలయేటి గలగల చిరుగాలి కిలకిలా సిగ్గుపడే బుగ్గలతో చెలి నవ్వుల మిలమిల చిలిపి చిలిపి చూపులతో నీ ఊహలే తళతళ చరణం: 2 పసి నిమ్మపండు కన్న నీవు పచ్చన ఫలియించిన మన వలపే వెచ్చవెచ్చన అనురాగం ఏదేదో అమరభావన అనురాగం ఏదేదో అమరభావన అది నీవు దయచేసిన గొప్ప దీవెన సెలయేటి గలగల...ఆ... చిరుగాలి కిలకిల..ఆ... సెలయేటి గలగల.....చిరుగాలి కిలకిల.... సిగ్గుపడే బుగ్గలతో చెలి నవ్వుల మిలమిల చిలిపి చిలిపి చూపులతో నీ ఊహలే తళతళ అహా...అ...అ.. .అహా... అహహహా...హా..అహహహా...హా...

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Tulasi

See All