Song Details
Lyrics
సందపొద్దు అందాలున్న చిన్నదీ ఏటి నీట తానాలాడుతు ఉన్నదీ సందపొద్దు అందాలున్న చిన్నదీ ఏటి నీట తానాలాడుతు ఉన్నదీ బొమ్మలా ముద్దుగుమ్మలా పువ్వులా పాలనవ్వులా మెరుపుతీగమల్లే తళుకుమంటే ఈ అద్దాల ఒళ్ళంతా ముద్దాడుకోనా సందపొద్దు అందాలున్న చిన్నదీ ఏటి నీట తానాలాడుతు ఉన్నదీ ఆకతాయి బుల్లోడల్లే అల్లరెడితే రాలుగాయి రాగాలన్ని రచ్చబెడితే ఎవ్వరైన చూసారంటే అల్లరైపోతానయ్యో ఎన్నెలంటి బతుకంతా చీకటైపోతాదయ్యో దీపమల్లే నేనుంటాను తీపి రేపు తెస్తుంటాను దీపమల్లే నేనుంటాను తీపి రేపు తెస్తుంటాను కలవపువ్వు నీవై ఎలుగు నేనై ఎలతేటి పాటల్లే చెలరేగిపోనా ముత్తెమంటి ఒళ్ళు తడిసి ముద్దు పుడితే గుండెలోన ఎండకాసి ఆరబెడితే ఆశలారిపోకుండా ఊసులాడుకోవాలి ఊసులెండిపోకుండా ఊట కోర్కెలుండాలి గువ్వలాటి జోడుండాలి యవ్వనాల గూడెయ్యాలి గువ్వలాటి జోడుండాలి యవ్వనాల గూడెయ్యాలి నిన్ను నన్ను చూసి దిష్టి తీసి ఆ లోకాల దేవుళ్ళే దీవించిపోవాలి సందపొద్దు అందాలున్న చిన్నదీ ఏటి నీట తానాలాడుతు ఉన్నదీ బొమ్మలా ముద్దుగుమ్మలా పువ్వులా పాలనవ్వులా మెరుపుతీగమల్లే తళుకుమంటే ఈ అద్దాల ఒళ్ళంతా ముద్దాడుకోనా సందపొద్దు అందాలున్న చిన్నదీ ఏటి నీట తానాలాడుతు ఉన్నదీ
Lyrics sourced from public databases. May contain errors.