MovieGQ

Chuttu Chengavi Cheera

Thoorpu Velle Railu (1979) · Track 4 of 7

Song Details

Lyrics

చుట్టూ చెంగావి చీర కట్టాలే చిలకమ్మ చుట్టూ చెంగావి చీర కట్టాలే చిలకమ్మ బొట్టు కాటుక పెట్టి నే కట్టే పాటను చుట్టి ఆశపడే కళ్ళల్లో ఊసులాడు వెన్నెలబొమ్మ.. చుట్టూ చెంగావి చీర కట్టాలే చిలకమ్మ తెల్లచీరకందం నువ్వే తేవాలే చిట్టెమ్మా నల్లచీర కట్టుకున్నా నవ్వాలే చిన్నమ్మా ఎర్రచీర కట్టుకుంటే సందెపొద్దు నువ్వమ్మా పచ్చచీర కట్టుకుంటే పంటచేల సిరివమ్మ చుట్టూ చెంగావి చీర కట్టాలే చిలకమ్మ నేరేడుపళ్ళ రంగు జీరాడే కుచ్చిళ్ళు ఊరించే ఊహల్లో దోరాడే పరవళ్ళు వంగపండు రంగులోన పొంగుతాయి సొగసుల్లు వన్నె వన్నె చీరల్లోనా నీ ఒళ్ళే హరివిల్లూ చుట్టూ చెంగావి చీర కట్టాలే చిలకమ్మ బొట్టు కాటుక పెట్టి నే కట్టే పాటను చుట్టి ఆశపడే కళ్ళల్లో ఊసులాడు వెన్నెలబొమ్మ.. చుట్టూ చెంగావి చీర కట్టాలే చిలకమ్మ

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Thoorpu Velle Railu

See All