Abhinandhana Mandara
Song
Movie
-
Music Director
-
Singers
- K.J. Yesudas
Lyrics
- పల్లవి:
అభినందన మందార మాల..
అభినందన మందార మాల..
అభినందన మందార మాల.. అభినాయక స్వాగత వేళ..ఆ..
అభినందన మందార మాల..
స్త్రీజాతికీ.. ఏనాటికీ.. మననీయ మహనీయ వీరాత్రనికి..
అభినందన మందారమాల.. అభినాయక స్వాగత వేళ..ఆ..
చరణం: 1
వేయి వేణువులు నిన్నే పిలువగ.. నీ పిలుపు నావైపు పయనించెనా
వేయి వేణువులు నిన్నే పిలువగ.. నీ పిలుపు నావైపు పయనించెనా
వెన్నెల కన్నెలు నిన్నే చూడగా..
వెన్నెల కన్నెలు నిన్నే చూడగా.. నీ చూపు నారూపు వరియించెనా
నీ చూపు నారూపు వరియించెనా..
నా గుండె పై నీవుండగా.. విరితానే భువిపైనే దిగివచ్చెనా
అభినందన మందారమాల.. అలివేణి స్వాగత వేళ..ఆ..
అభినందన మందారమాల..
సౌందర్యం సౌశీల్యం.. నిలువెల్ల నెలకొన్న కల భాషిణికి
అభినందన మందారమాల..
చరణం: 2
వెండి కొండపై వెలసిన దేవర.. నెలవంక మెరిసింది నీ కరుణలో
వెండి కొండపై వెలసిన దేవర.. నెలవంక మెరిసింది నీ కరుణలో
సగం మేనిలో ఒదిగిన దేవత..
సగం మేనిలో ఒదిగిన దేవత.. నునుసిగ్గు తొణికింది నీ తనువులో
నునుసిగ్గు తొణికింది నీ తనువులో..
ప్రియ భావమే లయ రూపమై.. అలలెత్తి ఆడింది అణువణువులో
అభినందన మందారమాల.. ఉభయాత్మల సంగమమేళ..ఆ..
అభినందన మందారమాల..
Thandra Paparayudu
Movie More SongsAbhinandhana Mandara Keyword Tags
-