Song Details
Lyrics
బ్రహ్మం తాత చెప్పింది నిత్యం జరిగే సత్యమిది తుచ తప్పక ఇప్పుడు జరిగే నవీన కాలజ్ఞానమిది బ్రహ్మం తాత చెప్పింది నిత్యం జరిగే సత్యమిది తుచ తప్పక ఇప్పుడు జరిగే నవీన కాలజ్ఞానమిది నీవాణ్ణే నువ్వు మెచ్చుకోవడం తెలుగుదనమేమి కాదు నీ తెలివి బైట పడబోదూ నీవాణ్ణే నువ్వు మెచ్చుకోవడం తెలుగుదనమేమి కాదు నీ తెలివి బైట పడబోదూ నీవాణ్ణే నువ్వు తిట్టకపోతే తెలుగువాడివే కాదు.. బ్రహ్మం తాత చెప్పింది నిత్యం జరిగే సత్యమిది తుచ తప్పక ఇప్పుడు జరిగే నవీన కాలజ్ఞానమిది ఓట్ల కోసమై ఊళ్ళు తిరగడం దేశం కోసం కాదు అది ప్రజాసేవకై కాదు ఓట్ల కోసమై ఊళ్ళు తిరగడం దేశం కోసం కాదు అది ప్రజాసేవకై కాదు హాయ్ ఛాన్స్ తగిలితే మంత్రినవుదునని ప్లాను లేకపోలేదు బ్రహ్మం తాత చెప్పింది నిత్యం జరిగే సత్యమిది తుచ తప్పక ఇప్పుడు జరిగే నవీన కాలజ్ఞానమిది పదవులకోసం ప్రాకులాడడం ప్రెస్టేజీకి కాదు మన ప్రజలబాగుకు కాదు పదవులకోసం ప్రాకులాడడం ప్రెస్టేజీకి కాదు మన ప్రజలబాగుకు కాదు పూలదండలిక పడబోవేమోనని చింతలేకపోలేదు బ్రహ్మం తాత చెప్పింది నిత్యం జరిగే సత్యమిది తుచ తప్పక ఇప్పుడు జరిగే నవీన కాలజ్ఞానమిది పంచాయతి ప్రసిడెంటు కావడం గ్రామం బాగుకు కాదు ఆ ప్రక్కకు బుద్దే పోదూ పంచాయతి ప్రసిడెంటు కావడం గ్రామం బాగుకు కాదు ఆ ప్రక్కకు బుద్దే పోదూ ఆహా ఉమ్మడి సొమ్ము భోంచేద్దామని ఊహ లేకపోలేదు బ్రహ్మం తాత చెప్పింది నిత్యం జరిగే సత్యమిది తుచ తప్పక ఇప్పుడు జరిగే నవీన కాలజ్ఞానమిది బ్రతికున్నప్పుడు నెత్తిననిప్పులు చల్లడమంటే మోజూ అది సహజంరా ఈ రోజు బ్రతికున్నప్పుడు నెత్తిననిప్పులు చల్లడమంటే మోజూ అది సహజంరా ఈ రోజు చచ్చిన పిమ్మట శిలావిగ్రహం స్థాపించడమే రివాజు బ్రహ్మం తాత చెప్పింది నిత్యం జరిగే సత్యమిది తుచ తప్పక ఇప్పుడు జరిగే నవీన కాలజ్ఞానమిది పేకముక్కలు చేతపట్టితే చీదరించుకొనిరానాడు ఛీఛీ అన్నారానాడూ పేకముక్కలు చేతపట్టితే చీదరించుకొనిరానాడు ఛీఛీ అన్నారానాడూ క్లబ్బుల్లో పేకాటగాళ్ళకే గౌరవమున్నది ఈనాడూ బ్రహ్మం తాత చెప్పింది నిత్యం జరిగే సత్యమిది తుచ తప్పక ఇప్పుడు జరిగే నవీన కాలజ్ఞానమిది బిడ్డలు ఎక్కువ కన్నతల్లినే భాగ్యవతన్నారానాడూ సౌభాగ్యవతన్నారానాడూ బిడ్డలు ఎక్కువ కన్నతల్లినే భాగ్యవతన్నారానాడూ సౌభాగ్యవతన్నారానాడూ బిడ్డలు లేని గొడ్రాలికే గౌరవమన్నారీనాడు బ్రహ్మం తాత చెప్పింది నిత్యం జరిగే సత్యమిది తుచ తప్పక ఇప్పుడు జరిగే నవీన కాలజ్ఞానమిది ప్రజాక్షేమమే పరమార్ధమ్మని ప్రభువులు పలికారానాడూ పరిపాలించారానాడూ ప్రజాక్షేమమే పరమార్ధమ్మని ప్రభువులు పలికారానాడూ పరిపాలించారానాడూ రకరకాల పన్నులను తగిలించి నీతిని చంపారీనాడూ బ్రహ్మం తాత చెప్పింది నిత్యం జరిగే సత్యమిది తుచ తప్పక ఇప్పుడు జరిగే నవీన కాలజ్ఞానమిది
Lyrics sourced from public databases. May contain errors.
Other Songs from Thalla Pellama
See AllKaalam Ee Kaalam O Babu Kalikaalam
L.R. Eswari
Telugu Jathi Manadi Ninduga Velugu Jathi Manadi
Ghantasala
O Bangaru Gootilona Chilaka
P. Susheela, Ghantasala
Thagithe Thappemundhi
Ghantasala
Maa Oopiri Mohabbath
Mohammad Rafi, S. Janaki
Krishnayya Krishnayya
Shantha Kumari
Manishi Janmaku Gyanakanthiki
Ghantasala