MovieGQ

Kongu Chatu

Taj Mahal (1995) · Track 2 of 6

Lyrics

కొంగు చాటు కృష్ణుడమ్మా కన్నెకెంతో ఇష్టుడమ్మా కన్నుగప్పి జారిపోయేనే గుండె చాటు ఆశలన్ని కొల్లగొట్టి చెప్పకుండా వెళ్ళిపోయి ఈడదాగెనే వాడ్ని కన్నెకైదులో కలిపి అట్టిపెట్టుకో వేడికౌగిలింత కంచే దాటి వెళ్లకుండా కాపుకాసుకో ఓ... కలగన్నది వరమైనది మనసైన వేళలో ఓ... అనుకోనిది నిజమైనది ఒకటైన హాయిలో గిల్లుకొని చూసేదా అల్లుకొని చూపేదా పట్టపగలే వెన్నెలంటే నేడు తెలిసే హా ఓ... కలగన్నది వరమైనది మనసైన వేళలో ఓ... అనుకోనిది నిజమైనది ఒకటైన హాయిలో ఘుమ్ ఘుమ్ గుప్పుమంటు గులాబీల తోట గుండెల్లోన పూసే ఈ పూట (2) వేడి ఊపిరి వేణు నాధంలా పాడుతున్నదే ప్రేమ వేధంలా లేడి చూపులే తేనె వాగుల్లా తాకుతున్నవే తీపి ఊహల్లా చేతికందేనమ్మా, కోరస్: పురిటి చందమామ ఎందుకందేనమ్మా, కోరస్: కన్నె సిగ్గు సీమ పాలరాతి బొమ్మా ప్రాణమొచ్చెనమ్మా హారతిచ్చి స్వాగతించు కౌగిలింత చేరువైన హాయివేళలో ఓ... కలగన్నది వరమైనది మనసైన వేళలో ఓ... అనుకోనిది నిజమైనది ఒకటైన హాయిలో ఏడు రంగుల వానవిల్లల్లే ఈడు పొంగెనే కంటి విందల్లే గుండె కోనలో స్వాతి జల్లల్లే నిండు స్నేహమే పండే వరమల్లే సొంతమైన జాణ, కోరస్: సోయగాల వీణ బంతిపూల మేన, కోరస్: నీకు మేము ఫ్లేమా పైడి ప్రాయమంత కానుకిచ్చుకోన జన్మలోన జారిపోని బ్రహ్మముడ్లు వేసినిన్ను ఏలుకుందునా ఓ... కలగన్నది వరమైనది మనసైన వేళలో ఓ... అనుకోనిది నిజమైనది ఒకటైన హాయిలో గిల్లుకొని చూసేదా అల్లుకొని చూపేదా పట్టపగలే వెన్నెలంటే నేడు తెలిసే హా కొంగు చాటు కృష్ణుడమ్మా కన్నెకెంతో ఇష్టుడమ్మా కన్నుగప్పి జారిపోయేనే గుండె చాటు ఆశలన్ని కొల్లగొట్టి చెప్పకుండా వెళ్ళిపోయి ఈడదాగెనే

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Taj Mahal

See All