MovieGQ

Theli Manchu

Swathi Kiranam (1992) · Track 3 of 12

Song Details

Lyrics

తెలి మంచు కరిగింది తలుపు తీయనా.. ప్రభూ.. ఇల గొంతు వణికింది పిలుపునీయనా.. ప్రభూ.. తెలి మంచు కరిగింది తలుపు తీయనా.. ప్రభూ.. ఇల గొంతు వణికింది పిలుపునీయనా.. ప్రభూ.. నీ దోవ పొడవునా కువకువల స్వాగతం.. నీ కాలి అలికిడికి మెలకువల వందనం!! తెలి మంచు కరిగింది తలుపు తీయనా.. ప్రభూ.. ఇల గొంతు వణికింది పిలుపునీయనా.. ప్రభూ..ఊ ఊ ఊ చరణం: 1 ఈ పూల రాగాల పులకింత గమకాలు..గారాబు కవనాల గాలి సంగతులు ఈ పూల రాగాల పులకింత గమకాలు..గారాబు కవనాల గాలి సంగతులు!! నీ చరణ కిరణాలు పలుకరించిన చాలు.. పల్లవించును ప్రభూ పవళించు భువనాలు!! భానుమూర్తీ.. నీ ప్రాణ కీర్తన వినీ పలుకని..ప్రణతులని ప్రణవ శృతిని.. పాని ప్రకృతిని ప్రధమ ప్రకృతిని!! తెలి మంచు కరిగింది తలుపు తీయనా.. ప్రభూ.. చరణం: 2 భూపాల నీ మ్రోల ఈ వేల గానాలు.. నీరాజసానికవి నీరాజనాలు.. భూపాల నీ మ్రోల ఈ వేల గానాలు.. నీరాజసానికవి నీరాజనాలు.. పసరు పవనాలలో పసి కూన రాగాలు.. పసిడి కిరణాల పడి పదును దేరిన చాలు.. తలయుచూ.. కలిరాకు బహుపరాకులు విని.. దొరలని..దోర నగవు దొంతరనీ.. తరలనీ దారి తొలగి రాతిరిని!! తెలి మంచు కరిగింది తలుపు తీయనా.. ప్రభూ.. ఇల గొంతు వణికింది పిలుపునీయనా.. ప్రభూ.. నీ దోవ పొడవునా కువకువల స్వాగతం.. నీ కాలి అలికిడికి మెలకువల వందనం!!

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Swathi Kiranam

See All