Song Details
Lyrics
జాలిగా జాబిలమ్మ రేయి రేయంతా జాలిగా జాబిలమ్మ రేయి రేయంతా రెప్ప వెయ్యనే లేదు ఎందుచేత ఎందుచేత పదహారు కళలని పదిలంగా వుంచనీ పదహారు కళలని పదిలంగా వుంచనీ ఆ కృష్ణ పక్షమే ఎదలో చిచ్చు పెట్టుట చేత చరణం:1 కాటుక కంటినీరు పెదవుల నంటనీకు చిరు నవ్వు దీపకళిక చిన్నబో నీయకు నీ బుజ్జి గణపతిని బుజ్జగించి చెబుతున్నా నీ బుజ్జి గణపతిని బుజ్జగించి చెబుతున్నా నీ కుంకుమకెపుడూ ప్రొద్దు గుంకదమ్మా చరణం:2 సున్ని పిండిని నలిచి చిన్నారిగా మలిచి సంతసాన మునిగింది సంతులేని పార్వతి సుతుడన్న మతిమరచి శూలాన మెడవిరిచి పెద్దరికం చూపె చిచ్చుకంటి పెనిమిటి ప్రాణపతి నంటుందా బిడ్డగతి కంటూందా ప్రాణపతి నంటుందా బిడ్డగతి కంటూందా ఆ రెండు కళ్ళల్లో అది కన్నీటి చితి కాలకూటంకన్న ఘాటైన గరళమిది గొంతునులిమే గురుతై వెంటనే వుంటుంది ఆటు పోటు ఘటనలివి ఆట విడుపు నటనలివి ఆదిశక్తివి నీవు అంటవు నిన్నేవి నీ బుజ్జి గణపతిని బుజ్జగించి చెబుతున్నా కంచి కెళ్ళిపొయేవే కధలన్ని
Lyrics sourced from public databases. May contain errors.
Other Songs from Swathi Kiranam
See AllKonda Konallo
Vani Jairam
Pranathi Pranathi
S.P. Balasubrahmanyam, Vani Jairam
Theli Manchu
Vani Jairam
Sruthi Neevu
Vani Jairam, K.S. Chithra
Shivani Bhavani (Male)
S.P. Balasubrahmanyam
Pranathi Pranathi (Female)
Vani Jairam
Aanathi Neeyara
Vani Jairam
Vaishnavi Bhargavi
Vani Jairam
Shivani Bhavani (Female)
Vani Jairam
Sangeetha Sahitya
S.P. Balasubrahmanyam
Om Guru (Slokam)
Vani Jairam