Figaru Maata Pakkanetti
Song
Movie
-
Music Director
-
Lyricist
-
Singers
- Mano
Lyrics
- అరె ఫిగరు మాట పక్కనెట్టు గురు గురూ
ఫ్రెండ్ తోటి మందుకొట్టు గురు గురూ
లైఫ్ కున్న గొప్ప గిఫ్ట్ లోవ్వే గురూ
లవ్ లేని లైఫ్ సుద్ద వేస్టే గురూ
అటు చూస్తే లవ్ మత్తు ఇటు బాటిల్ గమ్మత్తు
తీరిగ్గా మందేసి ఏసేద్దాం పై ఎత్తు
అరె ప్రేమలోన పడ్డవాడు గురు గురూ
బతికి బట్టకట్టలేదు గురు గురూ
మత్తులోన మనసు కొద్ది సేపే గురూ
మనసులోని ప్రేమ కరిగిపోదోయ్ గురూ
అటు చూస్తే ఎగ్జామ్స్ ఇటు చూస్తే ఫ్రీ డ్రింక్స్
అయ్యయ్యో స్టూడెంట్స్ మీకెన్ని కస్టమ్స్
మందు తాగేస్తే మనిషి తూళ్తాడు
మందు ఆపేస్తే ప్రభుత్వాలే కూలిపోతాయ్
అర్ యు స్యూర్ - ఎస్ బాస్
చరణం: 1
డే అండ్ నైట్ కష్టపడి పుస్తకాల్ని వెయ్యిసార్లు తిరగేద్దాం
పేపర్లు లీక్ అయితే బోరుమంటు గుక్కపెట్టి ఏడ్చేద్దాం
రామబ్రహ్మం ఒక్కడుంటే లక్షలాది పిల్లగాళ్ల
కష్టమంత మట్టిపాలురా సోదరా
ఉంది గురూ రీటెస్టు ఉంది గురూ
వేస్ట్ గురూ అది ఓ రొష్టు గురూ
కంప్యూటర్లో మిస్ఫీడైతే బ్రతుకే చీకటి మూత గురూ
చీటికీ మాటికి ఎగ్జామ్స్ వస్తే మెదడే మోడై పోవుగురూ
చదువుకున్న వాటికంటే చదువులేని వాడేమిన్న
లోక రీతి చూడు సోదరా
అవును గురూ నువ్వే రైట్ గురూ
పాస్ ఐనా అదే మన ఫేటు గురూ
అరె ఫిగరు మాట పక్కనెట్టు గురు గురూ
ఫ్రెండ్ తోటి మందుకొట్టు గురు గురూ
లైఫ్ కున్న గొప్ప గిఫ్ట్ లోవ్వే గురూ
లవ్ లేని లైఫ్ సుద్ద వేస్టే గురూ
చరణం: 2
అరె మస్తీ చెయ్యర మాస్తానా మస్తుగ ఉంది మైఖాన
మస్తీ చెయ్యర మాస్తానా మస్తుగ ఉంది మైఖాన
ఉరికనే మందేస్తూ మత్తులోన మునగమాకు ఓ బ్రదరు
గోల్డ్ మెడలు తెచ్చుకున్న గవర్నమెంట్ జాబ్ రాదు ఏ క్లవరు
అడ్డదారి తొక్కినోళ్లు అందళాలు ఎక్కుతుంటే
సిన్సియర్ కి చోటు ఏదిరా సోదరా
తప్పు గురూ - ఎలాగో చెప్పు గురూ
మనసుంటే మార్గం ఉంది గురూ
స్వార్ధం ముదిరిన ఈ దేశంలో ప్రతిభకు స్థానం లేదు గురూ
తలలను వంచుకు పోయే యువకులు
మనుషులు కానే కాదు గురూ
ఊరు మీద కోపమొచ్చి చూరుకింద కూలబడితే
లైఫ్ కింక అర్ధమేందిరా
నిరాశే వద్దుగురు టుమారో మనది గురూ
అవును గురూ టుడే మందెయ్యి గురూ హా
అరె ఫిగరు మాట పక్కనెట్టు గురు గురూ
ఫ్రెండ్ తోటి మందుకొట్టు గురు గురూ
లైఫ్ కున్న గొప్ప గిఫ్ట్ లోవ్వే గురూ
లవ్ లేని లైఫ్ సుద్ద వేస్టే గురూ
అటు చూస్తే లవ్ మత్తు ఇటు బాటిల్ గమ్మత్తు
తీరిగ్గా మందేసి ఏసేద్దాం పై ఎత్తు
అరె ప్రేమలోన పడ్డవాడు గురు గురూ
బతికి బట్టకట్టలేదు గురు గురూ
మత్తులోన మనసు కొద్ది సేపే గురూ
మనసులోని ప్రేమ కరిగిపోదోయ్ గురూ
అటు చూస్తే ఎగ్జామ్స్ ఇటు చూస్తే ఫ్రీ డ్రింక్స్
అయ్యయ్యో స్టూడెంట్స్ మీకెన్ని కస్టమ్స్
Suswagatham
Movie More SongsFigaru Maata Pakkanetti Keyword Tags
-
-