MovieGQ

O Priya

Suryudu (1998) · Track 4 of 6

Lyrics

ఓ ప్రియా నీకోసం నేను వస్తున్నా ఓ సఖి నీకోసం వేచి చూస్తున్నా ఓ ప్రియా నీకోసం నేను వస్తున్నా ఓ సఖి నీకోసం వేచి చూస్తున్నా మనసులోని మాటలన్నీ మల్లెపూల మాలగట్టి నీకు అందజేస్తున్నా మాసిపోని మమతలన్ని నీకు సొంతమేలె అంటూ ఒట్టు వేసి చెబుతున్నా నీకు సొంతమౌతా అంది మౌనరాగం ప్రాణమల్లే చూస్తా అంది ప్రేమ గీతం ఓ ప్రియా నీకోసం నేను వస్తున్నా చరణం: 1 గాలిపాలయేటి మల్లె జన్మ ఈ ఆలయాన వచ్చి వాలెనమ్మా దేవలోక పారిజాతమమ్మా ఈ సౌరభాల సారె తెచ్చెనమ్మా నల్ల మబ్బు చాటునున్న మెరుపైనా చల్లగాలి తాకకుంటే కదిలేనా వరమై రావే ఇలా మెరిసే లావణ్యమా రుణమే తిరేదెలా పిలిచే నా పుణ్యమా మళ్ళి మళ్ళి పుట్టుకొచ్చి ఆ రుణాన్ని పట్టుకొచ్చి చెల్లించు కౌగిళ్లలో ఓ ప్రియా నీకోసం నేను వస్తున్నా ఓ సఖి నీకోసం వేచి చూస్తున్నా చరణం: 2 నింగిలోని వాన విల్లువేనా నా ముంగిలంత ముగ్గులైన దానా పొంగుతున్న గంగవెల్లువైనా ఈ శంకరయ్యా శిరసు చేరుకుందా కొంగువెంట లాగుతుంటే నెరజాణ జింకలాగా మారిపోదా సింగమైన సిగలో మందారమై ఉండిపో సావాసమా ఒడిలో చల్లారవే రగిలే సౌందర్యమా కంటి చాటు కెంపు ఛాయా కుంకుమల్లే మారేనయ్యా నూరేళ్ళ నీ నీడలో ఓ ప్రియా నీకోసం నేను వస్తున్నా ఓ సఖి నీకోసం వేచి చూస్తున్నా మనసులోని మాటలన్నీ మల్లెపూల మాలగట్టి నీకు అందజేస్తున్నా మాసిపోని మమతలన్ని నీకు సొంతమేలె అంటూ ఒట్టు వేసి చెబుతున్నా నీకు సొంతమౌతా అంది మౌనరాగం ప్రాణమల్లే చూస్తా అంది ప్రేమ గీతం

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Suryudu

See All