Cheyi Vesthe Chalu Chirrumantadappa
Song
Movie
-
Music Director
-
Lyricist
-
Singer
-
Lyrics
- పల్లవి:
చేయి వేస్తే చాలు చిర్రుమంటాడప్పా
చూపుతోనే నన్నూ జుర్రు కుంటా డప్పా
ఏం ముంచు కొచ్చిందని యింతటి రుసరుసలు
బావా .. దారికి రావా
చేయి వేస్తే చాలు చిర్రుమంటాడప్పా
చూపుతోనే నన్నూ జుర్రుకుంటా డప్పా
ఏం ముంచు కొచ్చిందని యింతటి రుసరుసలు
బావా.. దారికి రావా..
చరణం: 1
రామ చిలక జామ పండు కొరికినప్పుడు
ఏమి రుచులు నాలోన కలిగెనప్పుడు
రామ చిలక జామ పండు కొరికినప్పుడు
ఏమి రుచులు నాలోన కలిగెనప్పుడు
చందమామ మొగలు మీద పొడిచినప్పుడు
వయసు ఎన్నిరేకులో విప్పెనప్పుడు
ఏమని చెప్పను ఎలా మనసు విప్పను
నీకు బదులుగా నేనే చెప్పవలసి వచ్చెను
బావా.. దారికిరావా
చేయి వేస్తే చాలుచిర్రుమంటాడప్పా
చూపుతోనే నన్నూ జుర్రుకుంటా డప్పా
ఏం ముంచు కొచ్చిందని యింతటి రుసరుసలు
బావా... దారికిరావా
చరణం: 2
గువ్వలాగ కన్నెమనసు ఎగురుతున్నది
నీ గుండెలోని గూటి కొరకు తిరుగుతున్నది
గువ్వలాగ కన్నెమనసు ఎగురుతున్నది
నీ గుండెలోని గూటి కొరకు తిరుగుతున్నది
లేతవలపు జింక లాగ దుముకు తున్నది
నీ కౌగిలిలో నిలుపుకుంటె వొదిగి వుంటది
మేనత్త కూతురిని నీ ముద్దు మరదల్ని
మేనత్త కూతురిని నీ ముద్దు మరదల్ని
జతగా నువు లేకుంటే బ్రతుకంతా ఒంటరిని
బావా.. దారికిరావా
చేయి వేస్తే చాలు చిర్రుమంటాడప్పా
చూపుతోనే నన్నూ జుర్రుకుంటా డప్పా
ఏం ముంచు కొచ్చిందని యింతటి రుసరుసలు
బావా.. దారికిరావా
- పల్లవి:
Srivaru Maavaru
Movie More SongsCheyi Vesthe Chalu Chirrumantadappa Keyword Tags
-
-
-


