MovieGQ

Panchami Poota Manchidhani

Sriranga Neethulu (1983) · Track 4 of 6

Song Details

Lyrics

పల్లవి: పంచమి పూట మంచిదని మాటిచ్చాను పొరపాటు వచ్చే వారం ముచ్చటని రాసిచ్చాను ఎద చాటు ఆ మాటే నా కొంప ముంచింది ఆ రాతే నా దుంప తెంచింది ఆ మాటే నా కొంప ముంచింది ఆ రాతే నా దుంప తెంచింది అయ్యో అయ్యో అయ్యో అయ్యో అయ్యో.. అయ్యో పాపం మంచోడని చనువిచ్చాను పొరపాటు ఊపిరి నీవే అన్నాడని మనసిచ్చాను గ్రహపాటు ఆ చనువే నా కొంప ముంచింది.. ఆ మనసే నా దుంప తెంచింది ఆ చనువే నా కొంప ముంచింది.. ఆ మనసే నా దుంప తెంచింది అయ్యో అయ్యో అయ్యో అయ్యో అయ్యో... పంచమి పూట మంచిదని మాటిచ్చాను పొరపాటు అయ్యొ పాపం మంచొడని చనువిచ్చాను పొరపాటు చరణం: 1 కళ్ళలోకి చూస్తే సంకేళ్ళు వేసేస్తావు నీ పైట చాటుకు వస్తే చాపల్లే చుట్టేస్తావు కలలోకి రావదన్నా వస్తావు రేయంతా నీ ప్రేమ ముద్దరలన్ని వేస్తావు ఒల్లంతా సరదాలే ఈ వేళ సరిగమలే పాడాయి ఆ మాటే అన్నావు చాలింక.. నీ మొజే మళ్ళింది నా వంక అయ్యొ అయొ అయొ అయ్యొ అయ్యో... పంచమి పూట మంచిదని మాటిచ్చను పొరపాటు అయ్యొ పాపం మంచోడని చనువిచ్చాను పొరపాటు చరణం: 2 ఎదురుగ ఉన్నా గాని ఎదలోకి రమ్మన్నానా? ఎగతాళికన్న గాని నను దొచుకోమన్నానా ? వగలన్ని చూస్తూ ఉంటే వయసూరుకుంటుందా? కనుసైగ చేస్తూ ఉంటే వలపాపుకుంటుందా ? సరికొత్త గుబులేదో గుండెల్లో రేపేవు ఈ వింతే పులకింత కావాలి... నీ చెంతే బ్రతుకంతా సాగాలీ అయ్యొ అయొ అయొ అయ్యొ అయ్యో.... అయ్యొ పాపం మంచోడని చనువిచ్చాను పొరపాటు పంచమి పూట మంచిదని మాటిచ్చాను పొరపాటు ఆ చనువే నా కొంప ముంచింది.. ఆ మనసే నా దుంప తెంచింది ఆ మాటే నా కొంప ముంచింది ఆ రాతే నా దుంప తెంచింది పంచమి పూట మంచిదని మాటిచ్చాను పొరపాటు అయ్యొ పాపం మంచోడని చనువిచ్చాను పొరపాటు

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Sriranga Neethulu

See All