MovieGQ

Kallu OK Pallu OK

Sriranga Neethulu (1983) · Track 3 of 6

Song Details

Lyrics

పల్లవి: కళ్ళు ఒకే...పళ్ళు ఒకే..నడుము.. ఒకే...నడక ఒకే.. ఆపైన వర్ణించ వీల్లేని అందాలన్నీ.. ఒకే..ఒకే..ఒకే.. మాట ఒకే..ఆట ఒకే.. వయసు.. ఒకే..మనసు ఒకే.. ఆపైన నాపైన నీకున్న.. తాపాలన్నీ.. ఒకే..ఒకే..ఒకే.. చరణం: 1 నీ కన్న తల్లీ నిను కన్న నాడే .. అడిగినావట నన్నే.. తొలిసారి నువ్వు..కను విప్పగానే.. వెతికినావట నన్నే.. ఎదిగావు కన్నెవై.. పదహారు వన్నెవై హద్దులేని తుంటరివై.. ముద్దులాడు అల్లరివై వంపుల సొంపుల ఒళ్ళంత కులుకై తడబడు అడుగుల టక్కరి నడకై నీ చుట్టు చుడుతున్న మనసైన చుట్టానైతే.. ఒకే..ఒకే..ఒకే.. కళ్ళు ఒకే...పళ్ళు ఒకే..నడుము ఒకే...నడక ఒకే.. ఆపైన నాపైన నీకున్నతాపాలన్నీ ఒకే..ఒకే..ఒకే.. చరణం: 2 నునుసిగ్గు మొగ్గై నూటొక్క రేకై.. విచ్చుకొంటిని నీకై నునూగు వయసై నూరేళ్ళ తపస్సై.. కాచుకొంటిని నీకై కొండంత కోరికై... గుండెల్లో చోటుకై.. చేరినావు నా చెలివై..మారినావు కౌగిలివై ఉరకల తురుగుల పరుగై నురుగై వలపుల మెలకుల వయ్యారి జతవై నీకళ్ళు నాకళ్ళు నిలువెత్తు అద్దాలైతే... ఒకే..ఒకే..ఒకే....... మాట ఒకే..ఆట ఒకే..వయసు ఒకే..మనసు ఒకే.. ఆపైన నాపైన నీకున్నతాపాలన్నీ ఒకే..ఒకే..ఒకే.. కళ్ళు ఒకే...పళ్ళు ఒకే..నడుము.. ఒకే...నడక ఒకే.. ఆపైన వర్ణించ వీల్లేని అందాలన్నీ.. ఒకే..ఒకే..ఒకే..

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Sriranga Neethulu

See All