Tiya Tiyani Kalalanu
Song
Movie
-
Music Director
-
Lyricists
- R.P. Patnaik
Singer
-
Lyrics
- తీయ తీయని కలలను కనడమే తెలుసు
కమ్మనీ ప్రేమలో
మనసంతా నువ్వని చెప్పడం తెలుసు
ప్రేమనే మత్తులో
ఎన్నాళ్ళైనా నేనుండి పోగలను
నీ కౌగిళ్ళలో
నేనెవరన్నది నే మరచిపోగలను
చూస్తూ నీ కళ్ళలో
తీయ తీయని కలలను కనడమే తెలుసు
కమ్మనీ ప్రేమలో
మనసంతా నువ్వని చెప్పడం తెలుసు
ప్రేమనే మత్తులో
తందారె నరె నరె నరె నరె నారే
తందారె నరె నరె నారే
తందారె నరె నరె నరె నరె నారే
తందారె నరె నరె నారే
చల చల్లని మంచుకు అర్ధమే కాదు
ప్రేమ చలవేమిటో
నును వెచ్చని మంటలు ఎరగవేనాడు
ప్రేమ సెగలేమిటో
వచ్చీ రానీ కన్నీరుకే తెలుసు
ప్రేమ లోతేమిటో
ముద్దేలేని అధరాలకే తెలుసు
ఈడు బాధేమిటొ
తీయ తీయని కలలను కనడమే తెలుసు
కమ్మనీ ప్రేమలో
మనసంతా నువ్వని చెప్పడం తెలుసు
ప్రేమనే మత్తులో
మురిపెంతో సరసం తీర్చమంటోంది
ప్రాయమీ వేళలో
తమకంతో దూరం తెంచమంటోంది
తీపి చెరసాలలో
విరహంతో పరువం కరిగిపోతోంది
ఆవిరై గాలిలో
కలిసుండే కాలం నిలిచిపోతుంది
ప్రేమ సంకెళ్లలో
తీయ తీయని కలలను కనడమే తెలుసు
కమ్మనీ ప్రేమలో
మనసంతా నువ్వని చెప్పడం తెలుసు
ప్రేమనే మత్తులో
- తీయ తీయని కలలను కనడమే తెలుసు
Sriram
Movie More SongsTiya Tiyani Kalalanu Keyword Tags
-