MovieGQ

Rama Rama

Srimanthudu (2015) · Track 1 of 6

Lyrics

హే సూర్యవంశ తేజమున్న సుందరాంగుడు పున్నమీచంద్రుడు మారాజైనా మామూలోడు మనలాంటోడు మచ్చలేని మనసున్నోడు జనం కొరకు ధర్మం కొరకు జన్మెత్తిన మహానుభావుడు... వాడే శ్రీరాముడు... హేయ్ రాములోడు వచ్చినాడురో దాని తస్సదియ్య శివధనస్సు ఎత్తినాడురో కోరస్: దాని తస్సదియ్య శివధనస్సు ఎత్తినాడురో నారి పట్టి లాగినాడురో దాని తస్సదియ్య నింగికెక్కు పెట్టినాడురో కోరస్: దాని తస్సదియ్య నింగికెక్కు పెట్టినాడురో ఫెళ ఫెళ ఫెళ ఫెళ్లుమంటు ఆకశాలు కూలినట్టు భళ భళ భళ భళ్లుమంటు దిక్కులన్ని వేలినట్టు విల విలమను విల్లువిరిచి జనకరాజు అల్లుడాయెరో మరామ రామ రామ రామ రామ రామ రామ రామదండులాగ అందరొక్కటౌదామా మరామ రామ రామ రామ రామ రామ రామ రామదండులాగ అందరొక్కటౌదామా మరామ రామ రామ రామ రామ రామ రామ మరామ రామ రామ రామ రామ రామ రామ హే రాజ్యమంటె లెక్కలేదురో దాని తస్సదియ్య అడవిబాట పట్టినాడురో కోరస్: దాని తస్సదియ్య అడవిబాట పట్టినాడురో హే పువ్వులాంటి సక్కనోడురో దాని తస్సదియ్య సౌక్యమంత పక్కనెట్టెరో కోరస్: దాని తస్సదియ్య సౌక్యమంత పక్కనెట్టెరో హేయ్ బలె బలె బలె మంచిగున్న బతుకునంత పణంపెట్టి పలు మలుపులు గతుకులున్న ముళ్ల రాళ్ల దారిపట్టి తన కథనే పూసగుచ్చి మనకు నీతి నేర్పినాడురో... మరామ రామ రామ రామ రామ రామ రామ రామదండులాగ అందరొక్కటౌదామా మరామ రామ రామ రామ రామ రామ రామ రామదండులాగ అందరొక్కటౌదామా హే రామసక్కనోడు మా రామచంద్రుడంట ఆడకళ్ల చూపుతాకి కందిపోతడంట అందగాళ్లకే గొప్ప అందగాడట నింగి నీలమై ఎవరికీ చేతికందడంటా హేయ్ జీవుడల్లే పుట్టినాడురో దాని తస్సదియ్య దేవుడల్లె ఎదిగినాడురో కోరస్: దాని తస్సదియ్య దేవుడల్లె ఎదిగినాడురో హేయ్ నేలబారు నడిచినాడురో దాని తస్సదియ్య పూల పూజలందినాడురో కోరస్: దాని తస్సదియ్య పూల పూజలందినాడురో హేయ్ పద పదమని వంతెనేసి పెనుకడలిని దాటినాడు పది పది తలలున్న వాణ్ని పట్టి తాటదీసినాడు చెడు తలుపుకు చావుదెబ్బ తప్పదంటు చెప్పినాడురో మరామ రామ రామ రామ రామ రామ రామ రామదండులాగ అందరొక్కటౌదామా మరామ రామ రామ రామ రామ రామ రామ రామదండులాగ అందరొక్కటౌదామా

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Srimanthudu

See All