Varaala Beramaya Vanarou Beramaya
Song
Movie
-
Music Director
-
Lyricist
-
Singer
-
Lyrics
- పల్లవి:
వరాల బేరమయా.. వనరౌ బేరమయా
వరాల బేరమయా.. వనరౌ బేరమయా
పరాకు సేయకు పదే పదే దొరకదయా
వరాల బేరమయా.. వనరౌ బేరమయా
చరణం: 1
దేవతలు దీవించి.. పంపిన పసరమయ
దేవతలు దీవించి.. పంపిన పసరమయ
కొన్నవారి కన్ని సిరులు కూర్చు గంగిగోవయా
వరాల బేరమయా.. వనరౌ బేరమయా
పరాకు సేయకు పదే పదే దొరకదయా
వరాల బేరమయా.. వనరౌ బేరమయా
చరణం: 2
మనిషికున్న తెలివున్నది.. మనిషిలోని చెడులేనిది
కొందామని అందరూ కొమ్ము పడితే కుమ్ముతుంది
కోరుకున్న వారివెంట గోవులాగే వస్తుంది
వరాల బేరమయా.. వనరౌ బేరమయా
పరాకు సేయకు పదే పదే దొరకదయా
వరాల బేరమయా.. వనరౌ బేరమయా
చరణం: 3
పచ్చనీ లచ్చిమికి పసుపు కుంకుమ పెట్టి దినము
ప్రొద్దున్నే మొక్కుకుంటే పోతుంది పాపము
ఆ.. ఆ.. ఆ.. ఆ... ఆ..
పాత్ర చూచి పాలను... మనసు తూచి మంచిని
ఇచ్చేది యీ ఆవు యిదే కామధేనువు
వరాల బేరమయా.. వనరౌ బేరమయా
పరాకు సేయకు పదే పదే దొరకదయా
వరాల బేరమయా.. ఆ.. ఆ.. ఆ..
- పల్లవి:
Sri Venkateswara Mahathyam
Movie More SongsVaraala Beramaya Vanarou Beramaya Keyword Tags
-
-
-