Sridevini Needhu Deverini Sarisaatileni Soubhagyavatini
Song
Movie
-
Music Director
-
Lyricist
-
Singer
-
Lyrics
- పల్లవి:
శ్రీదేవిని.. నీదు దేవేరిని
శ్రీదేవిని.. నీదు దేవేరిని
సరిసాటిలేని సౌభాగ్యవతిని
శ్రీదేవిని.. నీదు దేవేరిని
అనుపమ కౌస్తుభ మణియందు నెలకొని..
అనుపమ కౌస్తుభ మణియందు నెలకొని..
నీ హృదయ పీఠాన నివసించుదాన..
నీ హృదయ పీఠాన నివసించుదాన..
శ్రీదేవిని నీదు దేవేరిని
చరణం: 1
పాలకడలిలో ప్రభవించి.. మురిపాల కడలిలో తేలితిని
పాలకడలిలో ప్రభవించి.. మురిపాల కడలిలో తేలితిని
పదునాల్గు భువనాలు పరిపాలించు...
నీ మది నేలి లాలించు భాగ్యము నాదే..
శ్రీదేవిని.. నీదు దేవేరిని
శ్రీదేవిని.. నీదు దేవేరిని
చరణం: 2
కలిమికి నేనే దేవతనైన.. నీ చెలిమియె నా కలిమి కదా
కలిమికి నేనే దేవతనైన.. నీ చెలిమియె నా కలిమి కదా..
ఎనలేని అనురాగ సంతోషములతో.. ఆ... ఆ..
ఆ... ఆ.. ఆ.. ఆ.. ఆ..
ఎనలేని అనురాగ సంతోషములతో..
యేనాటికీ మనకు ఎడబాటులేదు...
యేనాటికీ మనకు ఎడబాటులేదు
శ్రీదేవిని.. నీదు దేవేరిని
శ్రీదేవిని.. నీదు దేవేరిని
సరిసాటిలేని సౌభాగ్యవతిని
శ్రీదేవిని.. నీదు దేవేరిని
- పల్లవి:
Sri Venkateswara Mahathyam
Movie More SongsSridevini Needhu Deverini Sarisaatileni Soubhagyavatini Keyword Tags
-
-
-