Sheshashailavasa Sri Venkatesa
Song
Movie
-
Music Director
-
Lyricist
-
Singer
-
Lyrics
- పల్లవి:
శేషశైలావాస శ్రీ వేంకటేశా.. శయనించు మా అయ్య శ్రీ చిద్విలాసా..
శేషశైలావాస శ్రీ వేంకటేశా.. శయనించు మా అయ్య శ్రీ చిద్విలాసా
చరణం: 1
శ్రీదేవి వంకకు చిలిపిగా చూడకు
అలమేలు మంగకు అలుక రానీయకు
శ్రీదేవి వంకకు చిలిపిగా చూడకు
అలమేలు మంగకు అలుక రానీయకు
ముద్దు సతులీద్దరిని ఇరువైపులా జేర్చి
ముద్దు సతులీద్దరిని ఇరువైపులా జేర్చి
మురిపించి లాలించి ముచ్చటల తేల్చి
శేషశైలావాస శ్రీ వేంకటేశా...
చరణం: 2
పట్టుపానుపు పైన పవళించర స్వామి
పట్టుపానుపు పైన పవళించర స్వామి
భక్తులందరు నిన్ను ప్రస్తుతించి పాడ
చిరు నగవులొలుకుచూ నిదురించు నీ మోము
చిరు నగవులొలుకుచూ నిదురించు నీ మోము
కరువు తీరా కాంచి తరియింతుము మేము
శేషశైలావాస శ్రీ వేంకటేశా..
శయనించు మా అయ్య శ్రీ చిద్విలాసా
- పల్లవి:
Sri Venkateswara Mahathyam
Movie More SongsSheshashailavasa Sri Venkatesa Keyword Tags
-
-
-