MovieGQ

Yenaadu Vidiponi

Sri Kanaka Mahalakshmi Recording Dance Troop (1988) · Track 9 of 9

Lyrics

ఏనాడు విడిపోని ముడి వేసెనే నీ చెలిమి తోడు ఈ పసుపు తాడు నీ చెలిమి తోడు ఈ పసుపు తాడు ఈ మధుర యామినిని ఏ జన్మ స్వప్నాల అనురాగమో ఏ జన్మ స్వప్నాల అనురాగమో పూసినది నేడు ఈ పసుపు తాడు పూసినది నేడు ఈ పసుపు తాడు ఈ సుచల ఆమనిని ఏనాడు విడిపోని ముడి వేసెనే ఏనాడు విడిపోని ముడి వేసెనే మోహాన పారాడు వేలి కొనలో నీ మేను కాదా చైత్ర వీణ వేవేల స్వప్నాల వేడుకలలో నీ చూపు కాదా పూల వాన రాగసుధ పారే అలల శృతిలో స్వాగతము పాడే ప్రణయము కలకాలము కలగానమై నిలవాలి మన కోసము ఈ మమత ఏనాడు విడిపోని ముడి వేసెనే ఏనాడు విడిపోని ముడి వేసెనే నీ మోవి మౌనాన మదన రాగం మోహాన సాగే మదుప గానం ఏ మోవి పూసింది చైత్ర మోదం చిగురాకు తీసే వేణు నాదం పాపలుగ వెలిసే పసిడి కలకు ఊయలను వేసే క్షణమిదే రేపన్నది ఈ పూటనే చేరింది మన జంటకు ముచ్చటగ ఏనాడు విడిపోని ముడి వేసెనే ఏనాడు విడిపోని ముడి వేసెనే నీ చెలిమి తోడు ఈ పసుపు తాడు పూసినది నేడు ఈ పసుపు తాడు ఈ మధుర యామినిని ఏనాడు విడిపోని ముడి వేసెనే ఏనాడు విడిపోని ముడి వేసెనే

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Sri Kanaka Mahalakshmi Recording Dance Troop

See All