MovieGQ

Yennenni Kalalu

Snehithulu (1998) · Track 6 of 6

Song Details

Singer
Music Director

Lyrics

పల్లవి: ఎన్నెన్ని కలలు కన్నాయి కన్నె కళ్ళు అన్ని కల్లలై ఇచ్చాయి కనీళ్లు అయ్యో పాపం... ఇదేం శాపం... నీ ఆశలను గాలి పాలు చేసే నలు దిశలు ఎన్నెన్ని కలలు కన్నాయి కన్నె కళ్ళు అన్ని కల్లలై ఇచ్చాయి కనీళ్లు అయ్యో పాపం... ఇదేం శాపం... చరణం: 1 మూడుముళ్లనే మురిపాలు మూడునాల్లకే మట్టిపాలు ఏడు అడుగుల పయణాలు నీకు చూపినవి నరకాలు ఏమి నేరమని ఈమె నోములను కాల రాచినవి కష్టాలు ఓ... బ్రహ్మయ్యా... ఆడ జన్మ పొంది చూడయ్య ఎన్నెన్ని కలలు కన్నాయి కన్నె కళ్ళు అన్ని కల్లలై ఇచ్చాయి కనీళ్లు అయ్యో పాపం... ఇదేం శాపం... చరణం: 2 ఆదరించు మనసేదైన ఆత్మబంధువే ఔతుంది రక్తబంధమే లేకున్నా మానవత్వమే చాలంది మనిషిలోని ఆ మంచితనమే ఈ నేల తల్లిని నిలిపింది ఓ... చిట్టి తల్లీ... నేడు నీకిదే పునఃజన్మ ఎన్నెన్ని కలలు కన్నాయి కన్నె కళ్ళు అన్ని కల్లలై ఇచ్చాయి కనీళ్లు అయ్యో పాపం... ఇదేం శాపం... నీ ఆశలను గాలి పాలు చేసే నలు దిశలు

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Snehithulu

See All