Song Details
Lyrics
వసంతమేది వరించి రాదు అదేరా విజయం తీరే వరాన్ని కోరే నీ పయనంలో ముందుంది ఆశల దారే రేపటి గెలుపుకు రూపమే ఓటమిరా వేకువ జాడను వెతికే మెరుపై రా వసంతమేది వరించి రాదు అదేరా విజయం తీరే వరాన్ని కోరే నీ పయనంలో ముందుంది ఆశల దారే చినుకై రాలే మేఘాన్ని ఆపేనా ఎవరైనా వెనుకడుగెయ్యక శిఖరాన్నే చేరాలో ఏమైనా నీ కలలను చూపేనా కని పెంచిన అమ్మైనా నీ కలతను చెరిపేనా శ్రుష్టించిన బ్రహ్మైనా నీకే సాధ్యం ....ఆ ఆ ఆ వసంతమేది వరించి రాదు అదేరా విజయం తీరే వరాన్ని కోరే నీ పయనంలో ముందుంది ఆశల దారే రేపటి గెలుపుకు రూపమే ఓటమిరా వేకువ జాడను వెతికే మెరుపై రా పడినా లేచే కెరటాల ప్రతిబింబం బ్రతుకేగా నడి రాతిరిని దాటందే ఉదయం చిగురించదుగా ఆ నింగిని తాకేలా సందిస్తే నీ బాణం తన పరుగును ఆపేనా ఎదురయ్యే అవరోధం గెలుపే తధ్యం .....ఆ ఆ ఆ వసంతమేది వరించి రాదు అదేరా విజయం తీరే వరాన్ని కోరే నీ పయనంలో ముందుంది ఆశల దారే రేపటి గెలుపుకు రూపమే ఓటమిరా వేకువ జాడను వెతికే మెరుపై రా
Lyrics sourced from public databases. May contain errors.