Song Details
Lyrics
కు కు కు కు కు కు కు కు కు కు కు కు కోకిల రావె కు కు కు కు కు కు కోకిల రావె రాణివాసము నీకు ఎందుకో కో కో రెక్క విప్పుకో చుక్కలందుకో కో కో చరణం: 1 రంగుల లోకం పిలిచే వేళ రాగం నీలో పలికే వేళ విరుల తెరలే తెరచి రావే బిడియం విడిచి నడచి రావే నా పాటల తోటకు రావె ఈ పల్లవి పల్లకిలో నా పాటల తోటకు రావె ఈ పల్లవి పల్లకిలో స్వరమై రావే విరి పొదల ఎదలకు చరణం: 2 సూర్యుడు నిన్నే చూడాలంట చంద్రుడు నీతో ఆడాలంట బురుజు బిరుదు విడిచి రావే గడప తలుపు దాటి రావే నువు ఏలే రాజ్యం ఉంది ఆ నాలుగు దిక్కులలో నువు ఏలే రాజ్యం ఉంది ఆ నాలుగు దిక్కులలో లయగా రావే ప్రియ హృదయ జతులకు
Lyrics sourced from public databases. May contain errors.