MovieGQ

Jilibili Palukulu

Sitara (1984) · Track 1 of 6

Song Details

Lyrics

అ హ హ హ హ... జిలిబిలి పలుకుల చిలిపిగ పలికిన ఓ మైనా మైనా కిలకిల నగవుల వలపులు చిలికిన ఓ మైనా మైనా మిల మిల మెరిసిన తార మిన్నుల విడిన సితార మిల మిల మెరిసిన తార మిన్నుల విడిన సితార మధువుల పెదవుల మమతలు విరిసిన ఓ మైనా ఓ మైనా కలలను పెంచకు కలతను దాచకు ఏ మైనా ఓ మైనా జిలిబిలి పలుకుల చిలిపిగ పలికిన ఓ మైనా మైనా కిలకిల నగవుల వలపులు చిలికిన ఓ మైనా మైనా అడగనులే చిరునామా ఓ మైనా ఓ మైనా చిరునవ్వే పుట్టిల్లు నీ కైనా నాకైనా తారలకే సిగపువ్వా తారాడే సిరిమువ్వా తారలకే సిగపువ్వా తారాడే సిరిమువ్వా హరివిల్లు రంగుల్లో అందాలే చిలికిన చిలకవు, ఉలకవు పలకవు ఓ మైనా ఏ మైనా జిలిబిలి పలుకుల చిలిపిగ పలికిన ఓ మైనా మైనా ఉరుములలో అలికిడిలా వినిపించే ఈమైనా మెరుపులలో నిలకడగా కనిపించే ఈమైనా ఎండలకే అల్లాడే వెన్నెలలో క్రీనీడ ఎండలకే అల్లాడే వెన్నెలలో క్రీనీడ వినువీధి వీణంలో రాగంలా ఆశల ముంగిట ఊహల ముగ్గులు నిలిపేనా ఏ మైనా జిలిబిలి పలుకుల చిలిపిగ పలికిన ఓ మైనా మైనా తొలకరి వయసుల మిణుగురు సొగసులదీ మైనా మైనా మిల మిల మెరిసిన తార మిన్నుల విడిన సితార గుడికే చేరని దీపం పడమటి సంధ్యారాగం మధువుల పెదవుల మమతలు విరిసిన ఓ మైనా ఓ మైనా చుక్కలు అందక దిక్కుల దాగిన నేనేలే ఆమైనా జిలిబిలి పలుకుల చిలిపిగ పలికిన ఓ మైనా మైనా తొలకరి వయసుల మిణుగురు సొగసులదీ మైనా మైనా

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Sitara

See All