MovieGQ

Ye Naava Ye Theeramo

Sankeerthana (1987) · Track 10 of 11

Song Details

Singer
Music Director
Lyricist

Lyrics

పల్లవి: ఏ..ఏ...ఏహే...ఓ....ఓ...ఓ...ఓ.... ఓ...ఓ...ఓ...ఓ...ఓ... ఏ నావదే తీరమో... ఏ నేస్తమే జన్మవరమో ఏ నావదే తీరమో... ఏ నేస్తమే జన్మవరమో కలగానో...ఓ..ఓ... కథగానో.... ఓ.. ఓ.. మిగిలేది నీవే... ఈ జన్మలో... ఓ... ఏ నావదే తీరమో... ఏ నేస్తమే జన్మవరమో చరణం: 1 నాలోని నీవే నేనైనానో.... నీలోని నేనే నీవైనావో నాలోని నీవే నేనైనానో.... నీలోని నేనే నీవైనావో విన్నావా ఈ వింతను.... అన్నారా ఎవరైనను విన్నావా ఈ వింతను.... అన్నారా ఎవరైనను నీకు నాకే చెల్లిందను... ఉ.. ఉ... ఏ నావదే తీరమో... ఏ నేస్తమే జన్మవరమో చరణం: 2 ఆకాశమల్లె నీవున్నావు.... నీ నీలి రంగై నేనున్నాను ఆకాశమల్లె నీవున్నావు.... నీ నీలి రంగై నేనున్నాను కలిసేది ఊహేనను.... ఊహల్లో కలిసామను... కలిసేది ఊహేనను.... ఊహల్లో కలిసామను... నీవు... నేనే... సాక్షాలను... ఏ నావదే తీరమో.... ఏ నేస్తమే జన్మవరమో కలగానో... ఓ... కథగానో.... ఓ... మిగిలేది నీవే ఈ జన్మలో... ఏ నావదే తీరమో... ఏ నేస్తమే జన్మవరమో ఏ నావదే తీరమో... ఏ నేస్తమే జన్మవరమో

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Sankeerthana

See All