Song Details
Lyrics
మనసున మొలిచిన సరిగమలే ఈ గల గల నడకల తరగలుగా నా కలలను మోసుకు నిను జేరీ ఓ కమ్మని ఊసుని తెలిపేనే కవితవు నీవై పరుగున రా యెద సడితో నటియించగ రా స్వాగతం సుస్వాగతం స్వాగతం సుస్వాగతం కూకూ చుకుచుకు కూకూ చుకుచుకు కూకూ చుకుచుకు కూకు రా రా స్వరముల సోపానములకు పాదాలను జత చేసీ కుకూ కుకూ కీర్తనా తొలి ఆమనివై రా పిలిచే చిలిపి కోయిలా యెట దాగున్నావు కూకూ చుకుచుకు కూకూ చుకుచుకు కూకూ చుకుచుకు కూకు రా రా స్వరముల సోపానములకు పాదాలను జత చేసీ మీ నృత్యం చూసి నిజంగ...నిజంగ మువ్వల రవలి పిలిచింది కవిత బదులు పలికిందీ కలత నిదుర చెదిరింది మనసు కలను వెతింకిందీ వయ్యరాల గౌతమీ వయ్యరాల గౌతమి ఈ కన్యారూప కల్పనా వసంతాల గీతినీ నన్నే మేలుకొల్పెనా భావాల పూల రాగల బాట నీకై వేచేనే కూకూ చుకుచుకు కూకూ చుకుచుకు కూకూ చుకుచుకు కూకు యేదో స్వరగతి నూతన పదగతి చూపెను నను శృతి చేసీ ఇది నా మది సంకీర్తనా కుకూ కుకూ కూ సుధలూరే ఆలాపన కుకూ కుకూ కూ యేదో స్వరగతి నూతన పదగతి చూపెను నను శృతి చేసీ కూకూ చుకుచుకు కూకూ చుకుచుకు కూకూ చుకుచుకు కూకు లలిత లలిత పదబంధం మదిని మధుర సుమగంధం చలిత మృదుల పదలాస్యం అవని అధర దరహాసం మరందాల గానమే మరందాల గానమే మృదంగాల నాదము ప్రబంధాల ప్రాణమే నటించేటి పాదము మేఘాల దారి వూరేగు వూహ వాలే ఈ మ్రోల కూకూ చుకుచుకు కూకూ చుకుచుకు కూకూ చుకుచుకు కూకు యేదో స్వరగతి నూతన పదగతి చూపెను నను శృతి చేసీ ఇది నా మది సంకీర్తనా కుకూ కుకూ కూ సుధలూరే ఆలాపన కుకూ కుకూ కూ రా రా స్వరముల సోపానములకు పాదాలను జత చేసీ కూకూ చుకుచుకు కూకూ చుకుచుకు కూకూ చుకుచుకు కూకు
Lyrics sourced from public databases. May contain errors.
Other Songs from Sankeerthana
See AllKaliki Menulo
S.P. Balasubrahmanyam, S. Janaki
Manase Padenule
S.P. Balasubrahmanyam
Ve Vela Varnala
S.P. Balasubrahmanyam, Vani Jairam
Devi Durga Devi
S.P. Balasubrahmanyam, Vani Jairam
Vanda Roopayalu Notu
S.P. Sailaja
Divi Darula (Kavitha)
S.P. Balasubrahmanyam
Thillana (Dim Tarana)
S.P. Balasubrahmanyam, S.P. Sailaja
Ganam Aagi Podule
S.P. Balasubrahmanyam
Ye Naava Ye Theeramo
K.J. Yesudas
Om Kara Vakyam
S.P. Balasubrahmanyam, S. Janaki