Song Details
Lyrics
కుంతీ కుమారి తననోరు జారి రాసింది ఒక భారతం కన్యాకుమారి తనకాలు జారి చేసింది నా జీవితం క్షణకాల పాపం కనుమాయ చేసి తన పేగు తెంచిందిరా లోకాలు పుట్టే ఆ మురికి తొట్టే నను కన్న కడుపాయెరా కుంతీ కుమారి తననోరు జారి రాసింది ఒక భారతం నీలాలు కారే నా కళ్ళనిండా నీరెండె మిగిలిందిరా పాలరాబోసే పసిగుండెలోన పగ నిండిపోయిందిరా లోకాలు తిరిగి ఏకాకి లాగ శోఖాన్ని దాచానురా గతమంత మరిచే గరళాన్ని తాగి బతుకీడ్చు తున్నానురా కుంతీ కుమారి తననోరు జారి రాసింది ఒక భారతం నడివీధి రాళ్లే గుడిలోన పెట్టి దేవుణ్ణి చేశారురా నను కన్న వాళ్లే నడివీధినేసి నగుబాటు చేశారురా ఏ దేవుడైన నాలాగ పుడితే ఈ బాధ తెలిసేదిరా దీపాల గుడికి పాపాల ఒడికి తేడాలు తెలిసేవిరా కుంతీ కుమారి తననోరు జారి రాసింది ఒక భారతం కన్యాకుమారి తనకాలు జారి చేసింది నా జీవితం
Lyrics sourced from public databases. May contain errors.