Song Details
Lyrics
నీకోసం నే ఎదురు చూస్తున్నా ఆజా సనం ఆజా సనం నీ పేరే నే కలవరిస్తున్నా ఆజా సనం హై ఆజా సనం మనసిచ్చుకోనని ఏడుస్తు ఉంటది ఇచ్చాక మనసిలా నను ఏడిపిస్తది నీకోసం నే ఎదురు చూస్తున్నా ఆజా సనం హై ఆజా సనం పెదవిపైన చిరు నవ్వు లేదు కనుపాప లోన మైమరుపులు లేవు ఇంతలాగ దిగులెపుడు లేదుమరి ఎందుకంటే నువు లేవుకదా మనిషేమొ నేనిక్కడున్నా మనసే నాతోటి లేదు విరహాన వేధించకుండా నువు రెక్కలు కట్టుకు ఇప్పటికిప్పుడు రా... ఆజా సనం హై ఆజా సనం నీకోసం నే ఎదురు చూస్తున్నా ఆజా సనం హై ఆజా సనం నిదురలేదు ఏం కుదురు లేదు నీ చిలిపి చిలిపి ఆ తగువులు లేవు నువ్వు తప్ప ఏం గురుతు లేదు కన్నీళ్లు తప్ప కలలే లేవు నన్నేమొ నీకిచ్చుకున్నా నాతో నేనైన లేను నిన్నొదిలి బతికుండగలనా నా గుప్పెడు గుండెకు చప్పుడు పట్టుకు రా... ఆజా సనం హై ఆజా సనం నీకోసం నే ఎదురు చూస్తున్నా ఆజా సనం హై ఆజా సనం నీ పేరే నే కలవరిస్తున్నా ఆజా సనం ఆజా సనం మనసిచ్చుకోవని ఏడుస్తు ఉంటది ఇచ్చాక మనసిలా నను ఏడిపిస్తది నీకోసం నే ఎదురు చూస్తున్నా ఆజా సనం ఓ ఆజా సనం
Lyrics sourced from public databases. May contain errors.