Naa Pedavulu
Song
Movie
-
Music Director
-
Lyricist
-
Singers
- Sagar
Lyrics
- నా పెదవులు నువ్వైతే... నీ నవ్వులు నేనౌతా
నా కన్నులు నువ్వైతే... కల నేనౌతా
నా పాదం నువ్వైతే... నీ అడుగులు నేనౌతా
నా చూపులు నువ్వైతే... వెలుగే అవుతా
చెరో సగం అయ్యాం కదా ఒకే పదానికి
ఇలా మనం జతై
సదా శిలాక్షరం అవ్వాలి ప్రేమకీ
కనిపించని బాణం నేనైతే...
తియతీయని గాయం నేనౌతా
వెంటాడే వేగం నేనైతే... నేనెదురౌతా
వినిపించని గానం నేనైతే...
కవి రాయని గేయం నేనౌతా
శ్రుతిమించే రాగం నేనైతే... జతి నేనౌతా
దిగి వచ్చే నెచ్చెలి నేనౌతా
నిను మలిచె ఉలినే నేనైతే
నీ ఊహలు ఊపిరి పోసే
చక్కని బొమ్మను నేనౌతా
వేధించే వేసవి నేనైతే... లాలించే వెన్నెల నేనౌతా
ముంచెత్తే మత్తును నేనైతే... మైమరపౌతా
నువ్వోపని భారం నేనైతే...
నిన్నాపని గారం నేనౌతా
నిను కమ్మే కోరిక నేనైతే... రారమ్మంటా
వణికించే మంటను నేనైతే...
రగిలించే జంటను నేనౌతా
పదునెక్కిన పంటిని నేనైతే
ఎరుపెక్కిన చెక్కిలి పంచిన
చక్కెర విందే నేనౌతా
Ready
Movie More SongsNaa Pedavulu Keyword Tags
-
-