MovieGQ

Kanaraani Devude Kanipinchinade

Rangula Raatnam (1967) · Track 3 of 10

Song Details

Lyrics

పల్లవి: ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ కనరాని దేవుడే కనిపించినాడే...కనిపించి అంతలో... కన్ను మరుగాయే...కన్ను మరుగాయే.. కనరాని దేవుడే కనిపించినాడే...ఆ..ఆ..ఆ..ఆ చరణం: 1 అల నీలీగగనాన వెలిగే నీ రూపూ.. అల నీలీగగనాన వెలిగే నీ రూపూ ఆనంద బాష్పాల మునిగే నా చూపూ... మనసారా నిను చూడలేనైతి స్వామీ... కరుణించి ఒకసారి కనిపించవేమీ... చరణం: 2 అందాల కన్నయ్య కనిపించగానే... బృందావనమెల్ల పులకించిపొయే... యమునమ్మ కెరటాల నెలరాజు నవ్వే... నవ్వులో రాధమ్మ స్నానాలు చేసే...ఆ..ఆ..ఆ..ఆ చరణం: 3 వలపుతో పెనవేయు పారిజాతమునై... ఎదమీద నిదురించు అడియాశ లేదూ గడ్డిలో విరబూయు కన్నె కుసుమమునై... నీ చరణకమలాల నలిగి పోనీయవా... ఆ..ఆ..ఆ..ఆ.. కనరాని దేవుడే కనిపించినాడే... కనిపించి అంతలో కన్ను మరుగాయే ... కన్ను మరుగాయే..

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Rangula Raatnam

See All