Song Details
Lyrics
పల్లవి: చందురునిమించు అందమొలికించు ముద్దుపాపాయివే నిను కన్నవారింట కష్టములనీడ కరగిపోయేనులే కరుణతో జూచి కనకదుర్గమ్మ కామితములిచ్చులే లోకములనేలు వెంకటేశ్వరుడు నిన్ను దీవించులే చందురునిమించు అందమొలికించు ముద్దుపాపాయివే నిను కన్నవారింట కష్టములనీడ కరగిపోయేనులే కరుణతో జూచి కనకదుర్గమ్మ కామితములిచ్చులే లోకములనేలు వెంకటేశ్వరుడు నిన్ను దీవించులే చరణం: 1 అన్న ఒడి జేర్చి ఆటలాడించు నాటి కధ పాడనా .. నాటి కధ పాడనా కలతలకు లొంగి కష్టముల క్రుంగు నేటి కథ పాడనా .. కన్నీటి కధ పాడనా కలతలకు లొంగి కష్టముల క్రుంగు కన్నీటి కథ పాడనా కంటిలో పాప ఇంటికే జ్యోతి చెల్లి నా ప్రాణమే .. చెల్లి నా ప్రాణమే మము విధియె విడదీసే వెతలలో ద్రోసే మిగిలెనీ శోకమే .. మిగిలెనీ శోకమే విధియె విడదీసే.. వెతలలో ద్రోసే.. మిగిలెనీ శోకమే చరణం: 2 మనసులను కలుపు మధుర బంధాలు మాసిపోరాదులే పెరిగి నీవైన మామగారింటి మనువునే కోరుమా బంధమే నిల్పుమా .. మా బంధమే నిల్పుమా కాలమెదురైన గతులు వేరైన మమతలే మాయునా పెరిగి నీవైన అత్తగారింట కోడలిగ చేరుమా బంధమే నిల్పుమా .. మా బంధమే నిల్పుమా దివిలో తారకలు .. భువిలో మానవులు ధూళిలో కలసినా అన్నచెల్లెళ్ళ జన్మబంధాలె నిత్యమై నిల్చులే.. లాలి పాపయి హాయి పాపాయి.. లాలి పాపాయి జో జో.. లాలి పాపాయి జో జో ..
Lyrics sourced from public databases. May contain errors.