MovieGQ

Bangaru Bomma Raveme

Raktha Sambandam (1962) · Track 5 of 8

Song Details

Singer
Music Director
Lyricist

Lyrics

బంగారు బొమ్మ రావేమే పందిట్లో పెళ్లి జరిగేనే బంగారు బొమ్మ రావేమే పందిట్లో పెళ్లి జరిగేనే కళ్యాణ శోభకనగానే కనులార తనివితీరేనే ఓ బంగారు బొమ్మ రావేమే పందిట్లో పెళ్లి జరిగేనే ఎనలేని నోము నోచీ నీవీరోజుకెదురుచూచి మురిపించి మనసు దోచి మది ముత్యాల ముగ్గులేసి కలగన్న ఘడియ రాగానే తలవంచి బిడియ పడరాదే... కలగన్న ఘడియ రాగానే తలవంచి బిడియ పడరాదే ఓ బంగారు బొమ్మ రావేమే పందిట్లో పెళ్లి జరిగేనే అందాల హంస నడక ఈ అమ్మాయి పెళ్లినడక ఓయమ్మ సిగ్గుపడకే వేచి వున్నాడు పెళ్ళికొడుకే నూరేళ్ళపంట పండేనే గారాల సిరులు పెరిగేనే.. నూరేళ్ళపంట పండేనే గారాల సిరులు పెరిగేనే.. ఓ బంగారు బొమ్మ రావేమే పందిట్లో పెళ్లి జరిగేనే మనసైన వాడు వరుడు.. నీ మదినేలుకొనెడు ఘనుడు వేసేను మూడుముళ్ళు ఇక కురిసేను పూలజల్లు ఈ ఏటికిరువురొకటైతే మీదటికి ముగ్గురౌతారే ఈ ఏటికిరువురొకటైతే మీదటికి ముగ్గురౌతారే ఊ –ళ ళ ళ –హాయి ఓ బంగారు బొమ్మ రావేమే పందిట్లో పెళ్లి జరిగేనే బంగారు బొమ్మ రావేమే పందిట్లో పెళ్లి జరిగేనే

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Raktha Sambandam

See All