MovieGQ

Ye Janmadho

Rakshana (1993) · Track 4 of 5

Song Details

Lyrics

పల్లవి: ఆహహా లాలలా లల లల లల లల లలలా ఆహహా లాలలా లల లల లల లల లా హా ఏ జన్మదో ఈ సంబంధమూ ఏ రాగమో ఈ సంగీతమూ మనసే కోరే మాంగల్యం తనువే పండే తాంబూలం... ఈ ప్రేమ యాత్రలో ఏ జన్మదో ఈ సంబంధమూ చరణం: 1 ఒకరి కోసం ఒకరు చూపే మమత ఈ కాపురం చిగురు వేసే చిలిపి స్వార్థం వలపు మౌనాక్షరం పెళ్ళాడుకున్న అందం వెయ్యేళ్ళ తీపి బంధం మా ఇంటిలోన పాదం పలికించె ప్రేమ వేదం అందాల గుడిలోన పూజారినో ఓ బాటసారినో ఏ జన్మదో ఈ సంబంధమూ చరణం: 2 లతలు రెండూ విరులు ఆరై విరిసె బృందావనీ కలలు పండీ వెలుగులాయే కలిసి ఉందామనీ వేసంగి మల్లె చిలకే సీతంగి వేళ చినుకై హేమంత సిగ్గులొలికీ కవ్వింతలాయె కళకే ఈ పూల ఋతువంత ఆ తేటిదో ఈ తోటమాలిదో ఏ జన్మదో ఈ సంబంధమూ ఏ రాగమో ఈ సంగీతమూ మనసే కోరే మాంగల్యం తనువే పండే తాంబూలం... ఈ ప్రేమ యాత్రలో ఏ జన్మదో ఈ సంబంధమూ

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Rakshana

See All