Kalalone Kalagantunna
Song
Movie
-
Music Director
-
Lyricist
-
Singers
- Shaan
Lyrics
- కలలోనే కలగంటున్నా నిజమేదో కనుగొంటున్నా
చలియా నీ కన్నులలోన నా రూపం గమనిస్తున్నా
ఆనందం అంచున నేనున్నా...
ఏం చేసావే అందాల మైనా ఏదో కొత్త లోకన ఉన్నా
మతిపోతోంది నీ వింత మాయేదైనా...
గుర్తేలేదు ఆ నిన్న మొన్న ఎటుపోయింది ఏకాంత మైనా
మనసేతేలిపోతోంది మబ్బుల పైన...
ఆనందం అంచున నేనున్నా...
కలలోనే కలగంటున్నా నిజమేదో కనుగొంటున్నా
ఆనందం అంచున నేనున్నా...
తొలిసారి నా మదిని ఈ రోజే నవ్వించా
వేసారే నెమ్మదిని వెన్నెలపై నడిపించా
ఇన్నాళ్లు బతికే ఉన్నా ఇపుడేగా జీవిస్తున్నా
నా సంతోషం ఏదైనా నువ్వేగా
అచ్చం నీ లాగే ఏదో ఉన్నాగా
ప్రేమించే హృదయంలోని తెల్లదనానికి స్వాగతమిస్తున్నా
ఆనందం అంచున నేనున్నా... ఆకాశం నేనైపోతున్నా...
కలలోనే కలగంటున్నా నిజమేదో కనుగొంటున్నా
వర్షించే మేఘంలా ఉరిమావే ఇన్నాళ్లు
కరుణించే దేవతలా కురిశావే పన్నీరు
అవునంటూ వరమిచ్చావే నా ప్రేమకు బలమిచ్చావే
శూన్యాన్నే వెలిగించావే దీపంలా...
మౌనం కరిగేలా మాటే దిగుతున్నా
ప్రాణాన్నే వెంటాడే నీ బంధానికి నే సొంతం అవుతున్నా
ఆనందం అంచున నేనున్నా... ఆకాశం నేనైపోతున్నా...
కలలోనే కలగంటున్నా నిజమేదో కనుగొంటున్నా
ఆనందం అంచున నేనున్నా...
Raju Maharaju
Movie More SongsKalalone Kalagantunna Keyword Tags
-
-