MovieGQ

Manasaa Manasaa

Rajadhi Raja (2016) · Track 4 of 7

Song Details

Lyrics

మనసా మనసా సమయాల మాయ చూస్తున్నావా కనులే తెరచి కాలాన్ని స్వాగతిస్తున్నావా మనసా మనసా సమయాల మాయ చూస్తున్నావా కనులే తెరచి కాలాన్ని స్వాగతిస్తున్నావా దారులెన్నో ముందరున్నా తీరమైతే ఒకటేగా చేరుకున్నా తీరమైనా నీకు సొంతం అవుతుందా గాలులెన్నో తాకుతున్నా ఊపిరయ్యేదొకటేగా నువ్వు పీల్చే ఊపిరైనా నీకు తోడై ఉంటుందా ఏమిటోలే ఈ మాయ అసలేమిటోలే ఈ మాయ ఏమిటోలే ఈ మాయ అసలేమిటోలే ఈ మాయ తామరాకుపై నీటి బొట్టులా ఉంది గుండెపై ప్రేమ సంతకం ఆవిరవ్వనీ నీటి రాతలా లోపలున్నదీ తీపి జ్ఞాపకం చీకటైతె ఆ వెన్నెల్లో వేకువైతే ఆ వెలుగుల్లో హాయి చూడమంటుంది ఈ లోకం చేరువైతే ఈ చూపుల్లో దూరమైతే ఆ గురుతుల్లో దాగి ఉంటది ఆనందం మనసా... ఏమిటోలే ఈ మాయ అసలేమిటోలే ఈ మాయ ఏమిటోలే ఈ మాయ అసలేమిటోలే ఈ మాయ ఎత్తు పల్లం లేని బాటని చూపలేవుగా నువ్వు నేలకి ఆటు పోటులు లేని జన్మని చూడలేముగా ఎన్ని నాళ్ళకీ ఎంత చిన్నదో ఆకాశం ఆశ ముందర ఈ నిమిషం వెతకమన్నది నీ సంతోషం కోసం అంతులేని ఈ ఆరాటం ఆపమన్నది ఈ హృదయం పంపుతున్నది ఆహ్వానం మనసా ఏమిటోలే ఈ మాయ అసలేమిటోలే ఈ మాయ ఏమిటోలే ఈ మాయ అసలేమిటోలే ఈ మాయ మనసా మనసా సమయాల మాయ చూస్తున్నావా కనులే తెరచి కాలాన్ని స్వాగతిస్తున్నావా మనసా మనసా సమాయాల మాయ చూస్తున్నావా కనులే తెరచి కాలాన్ని స్వాగతిస్తున్నావా దారులెన్నో ముందరున్నా తీరమైతే ఒకటేగా చేరుకున్నా తీరమైనా నీకు సొంతం అవుతుందా గాలులెన్నో తాకుతున్నా ఊపిరయ్యేదొకటేగా నువ్వు పీల్చే ఊపిరైనా నీకు తోడై ఉంటుందా

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Rajadhi Raja

See All