MovieGQ

Surya Kireetame

Preminchukundam Raa (1997) · Track 3 of 6

Lyrics

సూర్య కిరీటమే నీవా చంద్ర సుమానివే నీవా మౌన సరస్సున దాగిన హిమ శంఖానివో తొలకరి మేఘ చాయలో మెరిసిన తారవో వాత్సాయన వనవాసినీ కావేరి సూర్య కిరీటమే నీవా చంద్ర సుమానివే నీవా మౌన సరస్సున దాగిన హిమ శంఖానివో తొలకరి మేఘ చాయలో మెరిసిన తారవో వాత్సాయన వనవాసినీ కావేరి పెదవి తాకి స్వాతిముత్యం పగడమయ్యిందా తనువు తాకి శ్వేతపుష్పం అరుణమయ్యిందా నీ ఒడి మన్మధ యాగ సీమ నీ సరి ఎవ్వరు లేరే భామ నీ తోనే పుట్టింది ప్రేమా కన్నె శకుంతలే నీవా కావ్య సుమానివే నీవా చల్లని వెన్నెల హాయిని వివరించేదెలా వెచ్చని ఊహల వీణని వినిపించేదెలా వాత్సాయన వనవాసినీ కావేరి సూర్య కిరీటమే నీవా చంద్ర సుమానివే నీవా సొగసు భారమోపలేక నడుము చిక్కిందా జాలిగొన్న జాణతనమే జఘనమయ్యిందా తుమ్మెద ఎరగని తేనె పువ్వా సౌందార్యానికి తావి నువ్వా ప్రియమార దరిచేరరావా సూర్య కిరీటమే నీవా చంద్ర సుమానివే నీవా మౌన సరస్సున దాగిన హిమ శంఖానివో తొలకరి మేఘ చాయలో మెరిసిన తారవో వాత్సాయన వనవాసినీ కావేరి

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Preminchukundam Raa

See All