Song Details
Lyrics
అంబరాల కోటలో వలపు మొగ్గ విచ్చుకుంది చూడరా సన్నజాజి తీగలా ప్రియుణ్ణి ఎట్ట హత్తుకుంది చూడరా లక్ష మాటలేలరా ప్రేమన్న రెండు అక్షరాలు చాలురా వెయ్యి జన్మలేలరా వలపు పండుగొక్క రోజు చాలురా చిన్ని చిన్ని గుండెలో ఉప్పొంగుతున్న ఆశలెన్నో చూడనా చిన్నదాని చూపులో తళుక్కుమన్న బాసలెన్నో చూడనా చిన్ని చిన్ని గుండెలో ఉప్పొంగుతున్న ఆశలెన్నో చూడనా చిన్నవాడి కళ్ళలో తళుక్కుమన్న బాసలెన్నో చూడనా నీడలాగ తోడు ఉంటా పారిజాతమా గుండెలోనే దాచుకుంటా నిన్నే ప్రాణమా చిన్ని చిన్ని గుండెలో ఉప్పొంగుతున్న ఆశలెన్నో చూడనా చిన్నవాడి కళ్ళలో తళుక్కుమన్న బాసలెన్నో చూడనా చరణం: 1 నీ వాకిట ముగ్గునౌతా సందెపొద్దు వాలినాక సిగ్గునౌతా నువ్వెళ్ళే దారిలోన నీడనిచ్చు గున్న మావి చెట్టునవుతా నా నవ్వులే నీవంట కంటిపాపలాగ నిన్ను చూసుకుంటా కన్నీటిని పంచుకుంటా కాలమంత నీకు నేను కావలుంటా ప్రేమ కన్న గొప్పదేది సృష్టిలోన లేదురా చిన్ని చిన్ని గుండెలో ఉప్పొంగుతున్న ఆశలెన్నో చూడనా చిన్నదాని చూపులో తళుక్కుమన్న బాసలెన్నో చూడనా చిన్ని చిన్ని గుండెలో ఉప్పొంగుతున్న ఆశలెన్నో చూడనా చిన్నవాడి కళ్ళలో తళుక్కుమన్న బాసలెన్నో చూడనా చరణం: 2 ధనమున్నా లేకున్నా గుప్పెడంత ప్రేమ ఉంది గుండెలోన చావైనా బ్రతుకైనా నిన్ను విడిచి ఉండలేను క్షణమైనా ఆ మాటే చాలునంట ఎన్ని బాధలైన నేను ఓర్చుకుంటా నీ చేయి పట్టుకుంటా కాళ్ళు కడిగి నన్ను నేను ఇచ్చుకుంటా సృష్టిలోనే అందమైన ప్రేమజంట మీదిరా చిన్ని చిన్ని గుండెలో ఉప్పొంగుతున్న ఆశలెన్నో చూడనా చిన్నదాని చూపులో తళుక్కుమన్న బాసలెన్నో చూడనా చిన్ని చిన్ని గుండెలో ఉప్పొంగుతున్న ఆశలెన్నో చూడనా చిన్నవాడి కళ్ళలో తళుక్కుమన్న బాసలెన్నో చూడనా ఆ నుదుటి బొట్టు మీద ఒట్టు నిన్ను వీడను మల్లె పూల మీద ఒట్టు మాట దాటను చిన్ని చిన్ని గుండెలో ఉప్పొంగుతున్న ఆశలెన్నో చూడరా చిన్నదాని కళ్ళలో తళుక్కుమన్న బాసలెన్నో చూడరా లక్ష మాటలేలరా ప్రేమన్న రెండు అక్షరాలు చాలురా వెయ్యి జన్మలేలరా వలపు పండుగొక్క రోజు చాలురా
Lyrics sourced from public databases. May contain errors.