Song Details
Lyrics
పల్లవి: ఎవరు నీవు నీ రూపమేది .. ఏమని పిలిచేదీ.. నిన్నేమని పిలిచేదీ ఎవరు నీవు నీ రూపమేది .. ఏమని పిలిచేదీ.. నిన్నేమని పిలిచేదీ నేనని వేరే లేనేలేనని... నేనని వేరే లేనేలేనని ఎలా తెలిపేదీ మీకెలా తెలిపేదీ.. చరణం: 1 నిదుర పోయిన మనసును లేపి.. మనిషిని చేసిన మమతవు నీవో నిదుర పోయిన మనసును లేపి.. మనిషిని చేసిన మమతవు నీవో నిదురేరాని కనులను కమ్మని.. కలలతో నింపిన కరుణవు నీవో పూజకు తెచ్చిన పూవును నేను ఊ... ఊ... ఊ... పూజకు తెచ్చిన పూవును నేను.. సేవకు వచ్చిన చెలిమిని నేను వసివాడే ఆ పసిపాపలకై.. వసివాడే ఆ పసిపాపలకై.. దేవుడు పంపిన దాసిని నేను నేనని వేరే లేనేలేనని ఎలా తెలిపేదీ.. మీకెలా తెలిపేదీ.. ఎవరు నీవు నీ రూపమేది .. ఏమని పిలిచేదీ.. నిన్నేమని పిలిచేదీ చరణం: 2 చేదుగ మారిన జీవితమందున.. తీపిన చూపిన తేనెవు నీవు.. చేదుగ మారిన జీవితమందున.. తీపిన చూపిన తేనెవు నీవు వడగాడ్పులలో వడలిన తీగకు..చిగురులు తొడిగిన చినుకే మీరు చిగురులు తొడిగిన చినుకే మీరు... కోరిక లేక కోవెలలోన.. వెలుగై కరిగే దీపం నీవు దీపంలోని తాపం తెలిసి.. దీపంలోని తాపం తెలిసి.. ధన్యను చేసే దైవం మీరు దైవం మీరు.. అహా హా అహా హా.. ఓహోహో ఓహోహో.. ఊహూహూ ఊహూహూ..
Lyrics sourced from public databases. May contain errors.