MovieGQ

Manasulu Murise Samayamidhi

Premalu Pellillu (1974) · Track 2 of 5

Song Details

Lyrics

పల్లవి: మనసులు మురిసే సమయమిది.. తనువులు మరిచే తరుణమిది మనసులు మురిసే సమయమిది.. తనువులు మరిచే తరుణమిది నీ కౌగిలిలో యవ్వనమంతా పువ్వై విరిసే వేళ యిది నీ కౌగిలిలో యవ్వనమంతా పువ్వై విరిసే వేళ యిది ఆ.. వేళ యిది.... ఆ.. వేళ యిది చరణం: 1 లలలల ....లల లాలల... లలలల ....లల లాలల లలలల ....లల లాలల.. లలలల ....లల లాలల తెలిమబ్బు జంట గగనాల వెంట జత జేరుతున్నది హృదయాలు రెండు యీ తీరమందు పెనవేసుకున్నవి సెలయేటి జంట ఆ కోనలందు కలబోసుకున్నది... పరువాలు రెండు ఒక దారివెంట పయనించుచున్నవి నీలాల నీ కళ్ళలో... నీ రూపమే వున్నది నీలాల నీ కళ్ళలో... నీ రూపమే వున్నది ఆశలే .. పెంచుకో ... మోజులే ... పంచుకో మనసులు మురిసే సమయమిది.. తనువులు మరిచే తరుణమిది నీ కౌగిలిలో యవ్వనమంతా పువ్వై విరిసే వేళ యిది... పువ్వై విరిసే వేళ యిది చరణం: 2 ఈ అంద చందాలలో ఈ ప్రేమ బంధాలలో.. ఉయ్యాల లూగిందిలే నేడు నా జీవితం ఈ అంద చందాలలో ఈ ప్రేమ బంధాలలో... ఉయ్యాల లూగిందిలే నేడు నా జీవితం నా సొగసులన్నిఈ నాటినుండి నీ సొంతమాయెలే మన జంట చూసి ఈ లోకమంత పులకించి పోవులే నిండైన మన ప్రేమలు నిలిచేను కలకాలము తోడుగా....నీడగా...జోడుగా...సాగిపో మనసులు మురిసే సమయమిది.. తనువులు మరిచే తరుణమిది నీ కౌగిలిలో యవ్వనమంతా పువ్వై విరిసే వేళ యిది ఆ... వేళ యిది ఆ... వేళ యిది... పువ్వై విరిసే వేళ యిది

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Premalu Pellillu

See All