MovieGQ

Priyathama

Prema (1989) · Track 6 of 7

Song Details

Lyrics

ప్రియతమా నా హృదయమా ప్రియతమా నా హృదయమా ప్రేమకే ప్రతి రూపమా ప్రేమకే ప్రతి రూపమా నా గుండెలో నిండిన గానమా నను మనిషిగా చేసిన త్యాగమా ప్రియతమా నా హృదయమా ప్రేమకే ప్రతి రూపమా శిలలాంటి నాకు జీవాన్ని పోసి కలలాంటి బ్రతుకు కళతోటి నింపి వలపన్న తీపి తొలిసారి చూపి ఎదలోని సెగలు అడుగంట మాపి నులివెచ్చనైన ఓదార్పు నీవై శృతిలయ లాగా జత చేరినావు నువులేని నన్ను ఊహించలేను నా వేదనంతా నివేదించలేను అమరం అఖిలం మన ప్రేమా ప్రియతమా నా హృదయమా ప్రేమకే ప్రతి రూపమా నీ పెదవి పైన వెలుగారనీకు నీకనులలోన తడి చేరనీకు నీ కన్నీటి చుక్కే మున్నీరు నాకు అది వెల్లువల్లే నను ముంచనీకు ఏ కారుమబ్బు ఎటు కమ్ముకున్నా మహాసాగరాలే నినుమింగుతున్నా ఈ జన్మలోనా ఎడబాటు లేదు పది జన్మలైనా ముడే వీడిపోదు అమరం అఖిలం మన ప్రేమా ప్రియతమా నా హృదయమా ప్రియతమా నా హృదయమా ప్రేమకే ప్రతి రూపమా ప్రేమకే ప్రతి రూపమా నా గుండెలో నిండిన గానమా నను మనిషిగా చేసిన త్యాగమా ప్రియతమా నా హృదయమా ప్రేమకే ప్రతి రూపమా ప్రియతమా నా హృదయమా ప్రేమకే ప్రతి రూపమా

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Prema

See All