Maa Maata
Song
Movie
-
Music Director
-
Lyricist
-
Singer
-
Lyrics
- మా మాట నీ నోట కసిగా నువ్వడిగావయ్య.. శీనయ్య
నువ్వు మా గుండె మంటలకు రూపానివైనావయ్య… శీనయ్య
ఈ అసమర్ధ పాలకుల పని పట్టగ పెను తుఫానువై కాన వచ్చావయా
నయ వంచనతో నటియించు నాయకులకు
నీ నయనాల జన శక్తి చూపించరావయ్య
మా మాట నీ నోట కసిగా నువ్వడిగావయ్య.. శీనయ్య
నువ్వు మా గుండె మంటలకు రూపానివైనావయ్య… శీనయ్య
చరణం: 1
నిజమంటే నిప్పంటే ఆ నిప్పే నీవు అన్యాయాన్ని దహియించర
నీ శ్వాస నీ ధ్యాస ఈ జనమేనంటూ
మా జన ఘోష నీ భాష చేసావు లేర
అలుపే లేని సూరీడు నీవేనురా
ఈ గెలుపింక మా బ్రతుకుకే మలుపురా
మా ఇన్నాళ్ళ కన్నీళ్ళు పోటెత్తగా
ఈ మంచోడు శీనయ్య మా అండ నిలిచాడు
మా మాట నీ నోట కసిగా నువ్వడిగావయ్య.. శీనయ్య
నువ్వు మా గుండె మంటలకు రూపానివైనావయ్య… శీనయ్య
చరణం: 2
మనలోన ఈ ఒకడు మనకోసం నిలచి తన ప్రాణాలు త్రొనమనెనురా
నీ గమ్యం నీ ధ్యేయం జన క్షేమం అంటూ
నీ పయనాన్ని సాగించి సాధించినావ
మా నిజమైన నాయకుడు నీవేనయ్య
నీ వెన్నంటే మేమంతా ఉంటమయ్యా
జన చైతన్యమే తన లక్ష్యం కాదా
ఈ ప్రజలంతా కోరేటి ప్రతినిధివి నీవయ్య
మా మాట నీ నోట కసిగా నువ్వడిగావయ్య.. శీనయ్య
నువ్వు మా గుండె మంటలకు రూపానివైనావయ్య… శీనయ్య
ఈ అసమర్ధ పాలకుల పని పట్టగ పెను తుఫానువై కాన వచ్చావయా
నయ వంచనతో నటియించు నాయకులకు
నీ నయనాల జన శక్తి చూపించరావయ్య
- మా మాట నీ నోట కసిగా నువ్వడిగావయ్య.. శీనయ్య
Prathinidhi
Movie More SongsMaa Maata Keyword Tags
-
-
-