Song Details
Lyrics
రింఝిం రింఝిం రింఝిం పలికెనులే నా ప్రణయగీతం నాలోని వాణి నీలాలవేణి తానే నేనై పాడగా నా మేనిలోన మాణిక్యవీణ నేనే తానై మ్రోగగా నేలా నింగీ ఆడగా పూలే తాళం వేయగా రింఝిం రింఝిం రింఝిం పలికెనులే నా ప్రణయగీతం నీ వదనమే కమలమై పూచెనా భావనలే రేకులై నాకై వేచెనా నీ హృదయమే భ్రమరమై దాగెనా కోరికలే రెక్కలై నాపై మూగెనా అహహా... కాలమే లీలగా ఆడెనా నీలో ఉన్న నాదాలన్ని నాలో పొంగెనా రింఝిం రింఝిం రింఝిం పలికెనులే నా ప్రణయగీతం నాలోని వాణి నీలాలవేణి తానే నేనై పాడగా నా మేనిలోన మాణిక్యవీణ నేనే తానై మ్రోగగా నేలా నింగీ ఆడగా పూలే తాళం వేయగా రింఝిం రింఝిం రింఝిం పలికెనులే నా ప్రణయగీతం నీ పెదవిఏ మురళిఐ పిలిచెనా రసధునులే రవుళులై నాలో నిలిచెనా నీ పదములే హంసలై కదలెనా లయజతులే హొయలులై నాలో ఒదిగెనా నందనం చేతికే అందెనా నాలో ఉన్న అందాలన్ని నీలో పండెనా రింఝిం రింఝిం రింఝిం పలికెనులే నా ప్రణయగీతం నాలోని వాణి నీలాలవేణి తానే నేనై పాడగా నా మేనిలోన మాణిక్యవీణ నేనే తానై మ్రోగగా నేలా నింగీ ఆడగా పూలే తాళం వేయగా రింఝిం రింఝిం రింఝిం పలికెనులే నా ప్రణయగీతం
Lyrics sourced from public databases. May contain errors.