MovieGQ

Lahiri Lahiri Lahiri

Postman (2000) · Track 1 of 10

Song Details

Lyrics

లాహిరి లాహిరి లాహిరి నన్ను చేరుకుంది చెలి మాధురి ఆహా లాహిరి లాహిరి లాహిరి నన్ను చేరుకుంది చెలి మాధురి లాహిరి లాహిరి లాహిరి నిన్ను అల్లుకుంది నా ఊపిరి వేకువే జాలువారింది గుండెల్లో వెన్నలే తెల్లవారింది కళ్లల్లో కోయిలై ఎదురు చూసింది నేనని కోవెలై ఎదురు వచ్చింది నీవని ఆనంద భాష్పలలో చూపుల చుక్కలతో పోల్చుకున్నాను నీ కంటి పాపల్లో ఇన్నాలు కలగన్న నా ప్రేమనీ నీ వోల్లోన వాలెటి పూవ్వుంటి నీదేనినీ ఓ... లాహిరి లాహిరి లాహిరి నన్ను చేరుకుంది చెలి మాధురి లాహిరి లాహిరి లాహిరి నిన్ను అల్లుకుంది నా ఊపిరి ఓ ప్రేమా నీవేనా నిన్ను పిలిచే చిరునామా నీ లేఖ చదివాకా తెలిసింది వలపు తీపీ పూల మొక్కలు మూగ రెప్పలు తెరచినప్పుడు ప్రేమ చప్పుడు పాల మనసులో నీవు తియ్యగా కదిలినప్పుడు ప్రేమ తప్పదు నీవే హరిచందనా గిరినందనా బిరివందనా నీకే అభినందనా అనుబంధమా రుణబంధమా తెలుసుకున్నాను నీ వెండి అందెల్లో నా గుండె సవ్వడ్లు ఉన్నాయనీ నీ నీడలో గడించు నా కది నూరేండ్లనీ లాహిరి లాహిరి లాహిరి నన్ను చేరుకుంది చెలి మాధురి లాహిరి లాహిరి లాహిరి నిన్ను అల్లుకుంది నా ఊపిరి ఆ మేఘం చలువెంతో తెలిపింది నీ దేహం నా రాగం లోలోనా వెలిగెేది నీ స్నేహం నీవు నిద్రలో చిన్ని పెదవులు కదిలినప్పుడు చిన్ని చప్పుడు కళల ఏరులో నీవు నవాల వచ్చినప్పడు ప్రేమ తప్పదు రావే దీవి కానుక ప్రియమాలికా మునిబాలికా నీవే నవకాంతిలా ఛామంతిలా శకుంతలా మిన్ను సెలయేరు దిగి వచ్చి నీ లాగా అవతరమెత్తింది నా కోసమే ఏదీ ఏమైనా నిన్ను నన్ను కలిపింది ఆ దైవమే ఓ... లాహిరి లాహిరి లాహిరి నన్ను చేరుకుంది చెలి మాధురి లాహిరి లాహిరి లాహిరి నిన్ను అల్లుకుంది నా ఊపిరి

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Postman

See All