Song Details
Lyrics
ఇదే మంచి రోజంది ముచ్చటగా ఇలా పంచ భూతాలు సాక్షులుగా ఇదే మంచి రోజంది ముచ్చటగా ఇలా పంచ భూతాలు సాక్షులుగా చినుకులనే అక్షింతలుగా మెరుపులతో దీవించెనుగా మేఘాల పెళ్లిపందిరి ఇదే మంచి రోజంది ముచ్చటగా ఇలా పంచ భూతాలు సాక్షులుగా ఇదే మంచి రోజంది ముచ్చటగా ఇలా పంచ భూతాలు సాక్షులుగా చినుకులనే అక్షింతలుగా మెరుపులతో దీవించెనుగా మేఘాల పెళ్లిపందిరి కలల రాణి కనులలోని కటిక చీకటి చెలిమి వీడి చలువలోన కరుగుతున్నది నిదరలోనే నిలిచిపోదు కాలమన్నది వెలుగువేలు రేయిచెలిమి అందుకున్నది వరాల పెన్నిది వరించు తున్నది తరంగమై మది తదాస్తు అన్నది గుండెల్లో ఈనాడు గంగల్లే పొంగింది రంగేళి దీపావళి ముంగెల్లో ఈనాడు సంక్రాంతి ముగ్గల్లే చేరింది నా నెచ్చెలి ఇదే మంచి రోజంది ముచ్చటగా ఇలా పంచ భూతాలు సాక్షులుగా మావిమాలు అల్లుకున్న మాలవిలతా జీవితాన్ని పంచుతున్న ప్రేమదేవత గుడికి చేరే గరికపువ్వులాంటి నా కధ బ్రతుకు తీపి తెలుసుకుంది నేడు నా ఎద కళ్యాణ మంత్రమై దీవించే ఈ క్షణం వెయ్యేళ్ళ బంధమై రమ్మంది కాపురం పారాణి పాదాల తారాడు నాధాలకాహ్వానమందిచనా నాలోని ప్రాణాలు పూమాలగా చేసి నీ పూజ కందించనా ఇదే మంచి రోజంది ముచ్చటగా ఇలా పంచ భూతాలు సాక్షులుగా ఇదే మంచి రోజంది ముచ్చటగా ఇలా పంచ భూతాలు సాక్షులుగా చిరునవ్వులనే అక్షింతలుగా సొగసులతో దీవించెనుగా అందాల పెళ్లిపందిరి ఇదే మంచి రోజంది ముచ్చటగా ఇలా పంచ భూతాలు సాక్షులుగా ఇదే మంచి రోజంది ముచ్చటగా ఇలా పంచ భూతాలు సాక్షులుగా
Lyrics sourced from public databases. May contain errors.