Chooda Chakkani
Song
Movie
-
Music Director
-
Lyricist
-
Singers
- S.P. Balasubrahmanyam
Lyrics
- హొయ్ చూడచక్కని జింకపిల్లరా శ్రీరామచంద్ర
హె చంగుమంటు చెంతకొచ్చెరా ఓ రామచంద్ర
నీ కోసమే నేపుట్టి పెరిగా ఇన్నాళ్ళుగా నీకోసం వెతికా
నీ తోడుంటే ప్రతిరోజూ పండగే నువులేకుంటే బతికేది దండగే
నీ జడ్లోని పువ్వై నే ఉంటానే పువ్వల బుల్లెమ్మా
కళ్లునావి చూపు నీదిరా శ్రీరామచంద్ర
మాట నాది మనసు నీదిరా ఓ రామచంద్ర
చంపకు చారెడు కళ్ళు చమంతులు పూసే వళ్లు
నీ నవ్వే మల్లెల జల్లే చిలకమ్మా
ఆ అన్నీ నీకే ఇస్తా నీ వెంటే నేనడిసొస్తా
నీ వాకిల ముందర ముగ్గై నేనుంటా
గుండెల నిండా ప్రేమండాలి భామ దాన్ని ఏంచేయాలో నువ్వే చెబుదువ రామ్మా
నలుగురు ముందు తాళిని కట్టేమామ
ఆ తరుతెంజేయలో చెబుతాలేమ్మా
ఊరంతా పచ్చంగా పందిల్లేయనా
పదుగురులో పదిలంగా పెళ్ళాడేయనా
నీ మెడ్లోని గోలుసై నీ గుండెల్లో కాపురమెట్టెయ్ నా
మాట నాది మనసు నీదిరా శ్రీరామచంద్ర
ఆ ఒళ్లు నాది ఊపిరి నీదిరా ఓ రామచంద్ర
గుడిలో దేవుడుకన్నా నువ్వేలే నాకు మిన్నా
నీ కాలికి అంటిన మాట్టే బొట్టంటా
మేడలు మిద్దెలకన్నా ముద్దొచ్చే పెదవులె మిన్నా
నీ కమ్మని ముద్దే కట్నం లెమ్మన్నా
కొంగులు జారే కమ్మని రాతిరి లోన
నువ్వు కోరిన పండు కొరికిస్తాలే మామ
కాటుక మరకలు అంటే కౌగిలిలోనా
తెల్లారులు నిన్ను కరిగిస్తాలే భామ్మ
నీ మాటే నే వింటా ఏ నాటికీ
సై అంటే సై అంటా సయ్యాటకి
చంగట్టేసి పట్టేసి చుట్టేస్త సిగ్గుల చిలకమ్మా
హె చూడచక్కని జింకపిల్లరా శ్రీరామచంద్ర
హె చంగుమంటు చెంతకొచ్చెరా ఓ రామచంద్ర
నీ కోసమే నేపుట్టి పెరిగా ఇన్నాళ్ళుగా నీకోసం వెతికా
నీ తోడుంటే ప్రతిరోజూ పండగే నువులేకుంటే బతికేది దండగే
నీ జడ్లోని పువ్వై నే ఉంటానే పువ్వల బుల్లెమ్మా
కళ్లునావి చూపు నీదిరా శ్రీరామచంద్ర
ఆహా హా మాట నాది మనసు నీదిరా ఓ రామచంద్ర
Pelli Pandiri
Movie More SongsChooda Chakkani Keyword Tags
-
-