MovieGQ

Maayadari Maayadari Andamaa

Pavitra Bandam (1996) · Track 5 of 6

Lyrics

మాయదారి మాయదారి అందమా ఉయ్యాలాటకింక సిద్ధమా హయ్య హయ్య హయ్ మాటకారి మాటకారి బంధమా మహా మాయ చేయ వద్దమ్మా హయ్య హయ్య హయ్ మదిలోన మొదటి ప్రేమా మితిమీరి పోయె భామా మది మాటలు మానమ్మా ... మల్లె గాలి పైన తేలి రామ్మా మాయదారి మాయదారి అందమా ఉయ్యాలాటకింక సిద్ధమా హయ్య హయ్య హయ్ మరిగే జాబిలీ కరిగే కౌగిలీ మదనపడే మదనుడికే విందు చెయ్యాలీ పెరిగే ఆకలీ కొరికే చెక్కిలీ మైమరిచే మురిపెముతో కంది పోవాలీ అందించనీ అధరాంజలీ శృతిమించనీ జతజావళీ చలిగాలి పైనతేలి చెలరేగు ఈ ఖవాళీ ప్రతి పూటా కావాలీ తాళ లేని వేళ లేని కేళీ మాయదారి మాయదారి అందమా ఉయ్యాలాటకింక సిద్ధమా హయ్య హయ్య హయ్ కుదురే లేదనీ ముదిరే బాధనీ తెలుసుకుని అలుసుకుని ముళ్ళు పడి పోనీ నిదరే రాదనీ అదిరే రాధనీ అదుముకొని చిదుముకొని చల్లబడి పోనీ కసిరేపనీ కొసరే పనీ నిశి కైపునీ నస ఆపనీ రస రాజధానిలోని రతిరాజుతో జవానీ సయ్యాటకు సయ్యననీ మోయలేని మోజు తీరిపోనీ మాయదారి మాయదారి అందమా ఉయ్యాలాటకింక సిద్ధమా హయ్య హయ్య హయ్ మాటకారి మాటకారి బంధమా మహా మాయ చేయ వద్దమ్మా హయ్య హయ్య హయ్

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Pavitra Bandam

See All