Song Details
Lyrics
కార్యేషుదాసి కరణేషు మంత్రి భోజ్యేషు మాత శయనేషు రంభ అపురూపమైనదమ్మ ఆడజన్మ ఆ జన్మకు పరిపూర్ణత ఇల్లాలమ్మా అపురూపమైనదమ్మ ఆడజన్మ ఆ జన్మకు పరిపూర్ణత ఇల్లాలమ్మా మగవాని బ్రతుకులో సగపాలు తనదిగా జీవితం అంకితం చేయగా... అపురూపమైనదమ్మ ఆడజన్మ ఆ జన్మకు పరిపూర్ణత ఇల్లాలమ్మా పసుపు తాడు ఒకటే మహాభాగ్యమై బ్రతుకుతుంది పడతి పతే లోకమై మగని మంచి కోసం పడే ఆర్తిలో సతిని మించగలరా మరే ఆప్తులు ఏ పూజ చేసినా ఏ నోము నోచినా ఏ స్వార్దము లేని త్యాగం భార్యగా రూపమే పొందగా... అపురూపమైనదమ్మ ఆడజన్మ ఆ జన్మకు పరిపూర్ణత ఇల్లాలమ్మా అపురూపమైనదమ్మ ఆడజన్మ ఆ జన్మకు పరిపూర్ణత ఇల్లాలమ్మా కలిమిలేములన్నీ ఒకే తీరుగా కలిసి పంచుకోగా సదా తోడుగా కలిసి రాని కాలం వెలే వేసినా విడిచి పోని బంధం తనై ఉండగా సహధర్మచారిణి సరిలేని వరమణి సత్యాన్ని కనలేని నాడు మోడుగా మిగలడా పురుషుడు... అపురూపమైనదమ్మ ఆడజన్మ ఆ జన్మకు పరిపూర్ణత ఇల్లాలమ్మా అపురూపమైనదమ్మ ఆడజన్మ ఆ జన్మకు పరిపూర్ణత ఇల్లాలమ్మా మగవాని బ్రతుకులో సగపాలు తనదిగా జీవితం అంకితం చేయగా.. కార్యేషుదాసి కరణేషు మంత్రి భోజ్యేషు మాత శయనేషు రంభ
Lyrics sourced from public databases. May contain errors.
Other Songs from Pavitra Bandam
See AllIsaalakidee Ammammo Yem Vedi
S.P. Balasubrahmanyam, Asha Bhosle
Oh My Dady Nevinna
S.P. Balasubrahmanyam, Mano, K.S. Chithra
Chali Kodtandi Kodtandi
S.P. Balasubrahmanyam, K.S. Chithra
Maayadari Maayadari Andamaa
S.P. Balasubrahmanyam, K.S. Chithra
Paatante Paata Kaadu
Suresh Peters, Anuradha Sriram