MovieGQ

Revulona Chirugali

Pasupu Parani (1980) · Track 6 of 7

Song Details

Lyrics

రేవులోన చిరుగాలి రెక్కలార్చుకుంటోంది ఆవులించి చిరు కెరటం ఒళ్ళు విరుచుకుంటోంది రేవులోనా .. చిరుగాలి రెక్కలార్చుకుంటోంది ఆవులించీ .. చిరు కెరటం ఒళ్ళు విరుచుకుంటోంది పడమటి కొండ పడుచు పసుపు చీర కట్టింది పడమటి కొండ పడుచు పసుపు చీర కట్టింది ఇసుక తిన్నెపై గవ్వలు నవ్వులెండ పెడుతున్నాయి రేవులోన చిరుగాలి రెక్కలార్చుకుంటోంది ఆవులించి చిరు కెరటం ఒళ్ళు విరుచుకుంటోంది జడలోని గులాబీ చలి మంటలు వేస్తోంది ఓహో..ఆఆఅ..ఆఆఆ... జలతారు జిలుగు పైట చదరంగం ఆడుతోంది లలలల లలల లలల హో... జడలోని గులాబీ చలి మంటలు వేస్తోంది జలతారు జిలుగు పైట చదరంగమాడుతోంది జలదరించి పై పెదవి చలివెందర పెడుతోంది బాజాలకు మాటిద్దామా... బాసికాలు కట్టిద్దామా బాజాలకు మాటిద్దామా... బాసికాలు కట్టిద్దామా రేవులోనా చిరుగాలి రెక్కలార్చుకుంటోంది రెక్కలార్చుకుంటోంది ఆవులించీ చిరు కెరటం ఒళ్ళు విరుచుకుంటోంది ఒళ్ళు విరుచుకుంటోంది ఈ కళ్ళతో ఆ కళ్ళు గస్తీలు కాస్తున్నాయి ఓహో..అఆఅ...ఆఆ...ఆఅ ఆ రూపుతో ఈ రూపులు విస్తళ్ళు వేస్తున్నాయి లలలలల్ లలల లలల అహాహ హ.. ఆ కళ్ళతో ఈ కళ్ళు గస్తీలు కాస్తున్నయ్ ఆ రూపుతో ఈ రూపులు విస్తళ్ళు వేస్తున్నయ్ మురిపించే ఆ పలుకులు స్వస్తి పలుకుతున్నాయి తోరణాలు కట్టిద్దామా... తొలివలపులు పండిద్దామా తోరణాలు కట్టిద్దామా... తొలివలపులు పండిద్దామా రేవులోనా చిరుగాలి రెక్కలార్చుకుంటోంది రెక్కలార్చుకుంటుంది ఆవులించీ చిరు కెరటం ఒళ్ళు విరుచుకుంటోంది ఒళ్ళు విరుచుకుంటోంది రేవులోన చిరుగాలి రెక్కలార్చుకుంటోంది ఆవులించి చిరు కెరటం ఒళ్ళు విరుచుకుంటోంది

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Pasupu Parani

See All