MovieGQ

Pullala Mantivi

Osey Ramulamma (1997) · Track 6 of 10

Lyrics

హేయ్ పుల్లలమంటివి గదరా ఇదిగో పులి పిల్లాలై వచ్చినాముర బట్వారి కొడుకా పుల్లలమంటివి గదరా ఇదిగో పులి పిల్లాలై వచ్చినాముర బట్వారి కొడుకా పుల్లలమంటివి గదరా ఇదిగో పులి పిల్లాలై వచ్చినాముర బట్వారి కొడుకా పుల్లలమంటివి గదరా ఇదిగో పులి పిల్లాలై వచ్చినాముర బట్వారి కొడుకా ఎల్లకాలము నీదే చెల్లుతుందనుకొని కల్లాకపటములేని పల్లె జనులకు నువ్వు ముల్లువోలె నిలిచినావురా దినదినము మమ్ముర నల్లులోలే నలిపినావురా మా ఆడ పడుచుల ఘొల్లుమనగా చెరచినావురా ఒరి దొరల కొడుకా తుళ్ళి తుళ్ళి నవ్వినవ్ గదరా అరె దొంగ కొడుకా అరె కళ్లులో కామమ్ముతో ప్రతి పిల్ల పిల్లకు కన్నువేసిన కళ్ళు రెండు పెరికి ముప్పై పళ్ళు చెప్పుతో రాలగొడతాం హా అరె పుల్లలమంటివి గదరా ఇదిగో పులి పిల్లాలై వచ్చినాముర బట్వారి కొడుకా పుల్లలమంటివి గదరా ఇదిగో పులి పిల్లాలై వచ్చినాముర బట్వారి కొడుకా ఎక్కడివి నీ పొలములు పటేల్లు కొడుకా ఎక్కడివి నీ చెలుకలు భూస్వామి కొడుకా ఒక్క రోజు కూడా ఒక్క నిమిషము సేపు దుక్కి దున్నలేని దున్నపోతువు నీకు దిక్కు తెలియని భూములెక్కడివి మా వెట్టియేగా చెక్కుచెదరని మేడలెక్కడివి మా కండ కల్వగ లెక్కలేని గరిసెలెక్కడివి మా నెత్తురోడగ చక్కని పన్నీరు లెక్కడివి మా చెమట రాలగ అరె చిక్కినవ్ ఇప్పటికి నువ్వు ఇక్కడ ఇయ్యల నిన్ను తొక్కిపట్టి తోలు పెట్టి ఠక్కున తల పగలగొడతం హా అరె పుల్లలమంటివి గదరా ఇదిగో పులి పిల్లాలై వచ్చినాముర బట్వారి కొడుకా పుల్లలమంటివి గదరా ఇదిగో పులి పిల్లాలై వచ్చినాముర బట్వారి కొడుకా వెట్టి పశులా మంటివిరో మా అన్న లాలో ఎట్టి బాధలు బెడితివిరో మా అక్కలాలో వెట్టిచాకిరి చెయ్యలేక పుట్టినట్టి ఊరు విడిచి పట్టణాలకు పారిపోతే పిట్టలోలే పట్టుకొచ్చి కట్టినావు కాల్లు చేతులురా కారాలు జెల్లి కొట్టితే కొరడాలు తెగినయి రా మా గెంజి పోతే కట్టి ఉచ్చ తాపినవ్ గదరా నిను కొట్టడానికి కట్టెలు ఎన్నైన చాలవురా నిను చంపడానికి అరె నిట్టనిలువున నరికి నేడు చుట్టుబట్టు ఊళ్లలో నీ పొట్ట పేగులు బలిని జెల్లే చిట్ట పులులం వచ్చినాముర హా అరె పుల్లలమంటివి గదరా ఇదిగో పులి పిల్లాలై వచ్చినాముర బట్వారి కొడుకా పుల్లలమంటివి గదరా ఇదిగో పులి పిల్లాలై వచ్చినాముర బట్వారి కొడుకా పుల్లలమంటివి గదరా ఇదిగో పులి పిల్లాలై వచ్చినాముర బట్వారి కొడుకా పుల్లలమంటివి గదరా ఇదిగో పులి పిల్లాలై వచ్చినాముర బట్వారి కొడుకా

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Osey Ramulamma

See All