Song Details
Lyrics
ఓ ముత్యాల రెమ్మా ఓ మురిపాల కొమ్మ ఓ పున్నామి బొమ్మ ఓ పుత్తడి గుమ్మ ఓ రాములమ్మా రాములమ్మా ఏం చూపులోయమ్మ ఏగు చుక్కనేనమ్మ సిరి నవ్వులోయమ్మ చంద్ర వంకనేనమ్మ ఓ రాములమ్మా రాములమ్మా నువ్వు కడవ మీద కడవ బెట్టి కదిలితేనమ్మ ఓ రాములమ్మా రాములమ్మా ఆ కరిమబ్బు వరిదుబ్బు కన్ను గిలిపెనమ్మ ఓ ఓ ఒసేయ్ రాములమ్మా నువ్వు సిందు మీద సిందేసి సెంగుమంటే నమ్మ ఓ ఓ ఒసేయ్ రాములమ్మా ఆ జింక పిల్ల పాదాలకు జంకు పుట్టేనమ్మ ఓ ఓ ఒసేయ్ రాములమ్మా (2) పరుగు పరుగు పాయలోన పైకి పైకి తేలుతుంటే నురగ తీరుగా ఉన్నావే ఓ రాములమ్మ విచ్చుకోని మొగ్గవోలె పచ్చిపాల నిగ్గువోలె ముచ్చటేసి పోతున్నవే ఓ రాములమ్మ వాగుల్లో వంకల్లో ఆ సేలల్లో ఆ మూలల్లో వాగుల్లో వంకల్లో ఆ సేలల్లో మూలల్లో నువ్వు పచ్చంగుండాలే నువ్వు పదిలంగుండాలే భూమి తల్లి సాక్షిగ నువ్వు క్షేమంగుండాలే సూరిడే నీ వంక తేరి చూసేనమ్మ ఓ ఓ ఒసేయ్ రాములమ్మా అడుగేస్తే నేలంతా అద్దమాయెనమ్మ ఓ ఓ ఒసేయ్ రాములమ్మా ఓ ఓ ఒసేయ్ రాములమ్మా పసిడి వన్నె ఒంటి మీద పాడు చూపు పడకుండా పసుపు పూసినారే అమ్మలు ఓ రాములమ్మ చిట్టి వయసు పారిపోయే సిగురు వయసు చేరెనని చీర కట్టినారే గుమ్మలు ఓ రాములమ్మ దొర గారి దొరసాని దీవెనలా కోసమని ఆ దొర గారి దొరసాని నిండు దీవెనల కోసమని కాళ్ళు మొక్తా బాంచనని వంగినావమ్మా మూడు కుంచాలిస్తే నిలువెత్తు పొంగినావమ్మా దొరగారి పై ఊగే పంకా వైనావమ్మా ఓ ఓ ఒసేయ్ రాములమ్మా దొరసాని కాల్లొత్తే దూది వైనావమ్మా ఓ ఓ ఒసేయ్ రాములమ్మా దేవిటినే వెలిగించే దివ్వే వైనావమ్మా ఓ ఓ ఒసేయ్ రాములమ్మా నలుగురికి తల్లోని నాల్క వైనావమ్మా ఓ ఓ ఒసేయ్ రాములమ్మా (2) చికటింట బిక్కుమంటు కలత పడ్డ కళ్ళల్లోన బాకులాంటి ఎలుగు మెరిసెనా ఓ రాములమ్మ మూగ బడ్డ వెదురులోన ముచ్చటైన రాగాలూదే ముద్దులయ్య చెయ్యి దొరికేనా ఓ రాములమ్మ కష్టాలు కన్నీళ్లు ఉంటాయా చానాళ్ళు కష్టాలు కన్నీళ్లు నిలిచి ఉంటాయా చానాళ్ళు ఇంకా పొదలు మాటు పువ్వుల్లాగ ఒదగాలోయమ్మ గుబులు లేని గువ్వల్లగా ఎగరాలోయమ్మ పచ్చని అడవితల్లి పందిరవుతుందమ్మా ఓ ఓ ఒసేయ్ రాములమ్మా నీరెండే నీ కాలి పారాణవుతుందమ్మ ఓ ఓ ఒసేయ్ రాములమ్మా పూసేటి పూలన్ని పోసే తలంబ్రాలమ్మ ఓ ఓ ఒసేయ్ రాములమ్మా కోయిలల సందడ్లే సన్నాయి మేళాలమ్మ ఓ ఓ ఒసేయ్ రాములమ్మా ఓ ఓ ఒసేయ్ రాములమ్మా
Lyrics sourced from public databases. May contain errors.
Other Songs from Osey Ramulamma
See AllLachulo Lachanna
Vandemataram Srinivas, S. Janaki
Chowdarygaru Naidugaru
Vandemataram Srinivas
Ye Asurudu Srushtinchina
Vandemataram Srinivas
Addalori Buddayya
Mano
Pullala Mantivi
Vandemataram Srinivas, S. Janaki
Ramasakkani Thalli
M.M. Keeravani, M.M. Srilekha
Erupu Rangu
K.S. Chithra
Inthi Ye Inti
Vandemataram Srinivas, K.S. Chithra
Ramulamma Oo Ramulamma
Vandemataram Srinivas