Song Details
Lyrics
పుత్తడి బొమ్మంటి ముద్దుల బాబుకి మెత్తని ఉయ్యాలా పొత్తిళ్ళలోని పున్నమి రాజుకు పువ్వుల ఉయ్యాలా ఊరంత చేరి ఉప్పొంగి పోయే పండుగ అయ్యేలా మా కంటి పాపకు జోజోలు పాడే గారాల ఉయ్యాలా మబ్బులలో జాబిలి మా సొంత మయ్యేలా సందడితో మా ఎదలే సంద్రమయ్యేలా ఇన్నాళ్ళకి ఇలా ఈ లోగిలి చిన్ని రామ లాలీ మేఘశ్యామా లాలీ రామ లాలీ మేఘశ్యామా లాలీ జో... జో జో జో, జో... జో జో జో పుత్తడి బొమ్మంటి ముద్దుల బాబుకి మెత్తని ఉయ్యాలా పొత్తిళ్ళలోని పున్నమి రాజుకు పువ్వుల ఉయ్యాలా నీ నవ్వుల్లో సిరి జల్లు కురిసిందిరా నీ అల్లరిలో హరివిల్లు విరిసిందిరా మా ముంగిల్లో రేపల్లె వెలసిందిరా తనే పాపల్లే ఈ తల్లి మురిసిందిరా నా ఒడిలో వొదిగి మైమరపించరా నువు త్వరగా ఎదిగి నను అమ్మా అనరా ఆ పిలుపే నా హృదయానికి ఉయ్యాలా ఇన్నాళ్ళకి ఇలా ఈ లోగిలి చిన్ని రామ లాలీ మేఘశ్యామా లాలీ జో... పుత్తడి బొమ్మంటి ముద్దుల బాబుకి మెత్తని ఉయ్యాలా జో... పొత్తిళ్ళలోని పున్నమి రాజుకు పువ్వుల ఉయ్యాలా ఈ కోటంతా ఇన్నాళ్లు చినబోయెరా ఈ మహారాణికి నా బహుమతి నువ్వేలేరా నీచేతుల్లో బొమ్మలుగా ఉంటామురా నువ్వు ఊరేగే అంబారి అవుతామురా నా పాలేతాగి నను పాలించరా మా పది ప్రాణాలు నీలో పెంచరా మా జతకే నువు ఊపాలి జంపాల ఇన్నాళ్ళకి ఇలా ఈ లోగిలి చిన్ని రామ లాలీ మేఘశ్యామా లాలీ జో... పుత్తడి బొమ్మంటి ముద్దుల బాబుకి మెత్తని ఉయ్యాలా జో... పొత్తిళ్ళలోని పున్నమి రాజుకు పువ్వుల ఉయ్యాలా పుత్తడి బొమ్మంటి ముద్దుల బాబుకి మెత్తని ఉయ్యాలా లాలల లాల లాలల లాల లాలల లాల లా పొత్తిళ్ళలోని పున్నమి రాజుకు పువ్వుల ఉయ్యాలా ఊహూఁ ఊహూఁ ఊహూఁ ఊహూఁ ఊ ఊ
Lyrics sourced from public databases. May contain errors.